టాలీవుడ్ స్టార్ల్ అథ్లెట్స్ లా మారిపోతున్నారు. స్పోర్ట్స్ పర్సన్స్ లా ఫిట్ నెస్ కు ఫుల్ ప్రియారిటీ ఇస్తున్నారు. సినిమాకు కథ ఎంత ఇంపార్టెంటో బాడీకి ఫిట్ నెస్ అంత ఇంపార్టెంట్ అనే మెసేజ్ ఇస్తూ గంటలకొద్దీ వర్కవుట్లు చేస్తున్నారు. మజిల్డ్ బాడీతో అభిమానులకు ఫిట్ నెస్ గోల్స్ విసురుతున్నారు. 

 

జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు పెర్ఫామర్ గా ఎంత హైట్స్ కు వెళ్తున్నాడో.. ఫిట్ నెస్ లోనూ అలాంటి గోల్సే సెట్ చేసుకుంటున్నాడు. రాఖీ టైమ్ లో హెవీ వెయిట్ తో కనిపించిన తారక్.. ఇపుడు మజిల్డ్ బాడీతో మెరుపులు మెరిపిస్తున్నాడు. టెంపర్ సినిమాలో ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ ట్రై చేసిన తారక్, అరవింద సమేతకు ఈ లుక్ ను మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ఇక ఇప్పుడు ట్రిపుల్ ఆర్ టైమ్ కు కండలతో కేక పుట్టిస్తున్నాడు. 

 

ఫిట్ నెస్ కు ఫస్ట్ నుంచి మంచి ప్రియారిటీ ఇస్తోన్న హీరో రామ్ చరణ్. భోజనం చేయడం ఎలాగో.. వర్కవుట్ చేయడం కూడా అలాగే అన్నట్టు వర్కవుట్స్ ను లైఫ్ లో ఓ భాగంగా మార్చుకున్నాడు చెర్రీ. ధృవలో ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ లో కనిపించిన చరణ్, వినయ విధేయ రామలో మజిల్ మేన్ లా మెరిశాడు. ఇక ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో బాక్సింగ్ ఛాంపియన్ లా ఫుల్ ఫిట్ గా కనిపిస్తున్నాడు చరణ్. 

 

సిక్స్ ఫీట్ కటౌట్ తో బోల్డంత ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హంక్ గా ఫీమేల్ ఫాలోయింగ్ ఉన్న డార్లింగ్ ఈ ఇమేజ్ ను కాపాడుకోవడానికి కటౌట్ పై స్పెషల్ ఫోకస్ పెడతాడు. గంటల కొద్దీ వర్కవుట్స్ చేస్తూ బాడీని షేప్ లో పెట్టుకుంటున్నాడు. బుజ్జిగాడులో చిక్కిపోయి మరీ సిక్స్ ప్యాక్ చూపించిన ప్రభాస్ బాహుబలిలో మ్యాచూమెన్ గా కనిపించాడు. తర్వాత సాహోలోనూ ఈ మజిల్డ్ బాడీతోనే మెరిశాడు. అభిమానులకు ఫిట్ నెస్ గోల్స్ విసిరాడు. 

 

అల్లు అర్జున్ డ్యాన్సులకు ఎంతమంది అభిమానులున్నారో.. అతని ట్రాన్స్ ఫర్మేషన్ ను మెచ్చుకునేవాళ్లు అంతమంది ఉన్నారు. గంగోత్రి టైమ్ లో చాలా సాధారణంగా కనిపించిన బన్నీ స్టైలీష్ స్టార్ గా ఎదిగాడంటే లుక్ పై ఇతను తీసుకున్న శ్రద్ధే కారణమని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ హీరో ఫిట్ నెస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ఇస్తాడు. అందుకే టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 

 

టాలీవుడ్ లో ఫస్ట్ ఎయిట్ ప్యాక్ హీరో నితిన్. ఇండస్ట్రీలో సిక్స్ ప్యాక్ ట్రై చేయడానికి చాలామంది ఆలోచిస్తున్న టైమ్ లో నితిన్ ఎయిట్ ప్యాక్ చేశాడు. హైప్రోటీన్ ఫుడ్, గంటలకొద్దీ వర్కవుట్ లు చేసి ద్రోణ సినిమాలో ఎయిట్ ప్యాక్ చూపించాడు. ఆ వర్కవుట్స్ ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: