దర్శకుడు సుకుమార్ కష్టాలను చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సుకుమార్ ఒక ఏడాది పాటు మహేష్ చుట్టూ తిరుగుతూ తన విలువైన కాలాన్ని వృథా చేసుకుంటే కష్టపడి అల్లు అర్జున్ ను ఒప్పించి మొదలుపెట్టిన ‘పుష్ప’ మూవీ షూటింగ్ కరోనా ఉధృతం తరువాత తిరిగి షూటింగ్ లు మొదలైనా ‘పుష్ప’ కు మన తెలుగు రాష్ట్రాలలోని ఇరు ప్రభుత్వాల నుండి ఇప్పట్లో అనుమతులు రావడం కష్టం అన్న ప్రచారం జురుగుతోంది.


షూటింగ్ లకు ప్రభుత్వాల నుండి అనుమతులు వచ్చినా అది కేవలం ఇండోర్ షూటింగ్ లకు మాత్రమే అనుమతులు ఉంటాయి అని అంటున్నారు. మరో నాలుగు నెలల వరకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితులలోను అవుట్ డోర్ షూటింగ్ లకు అనుమతులు ఇవ్వకపోవచ్చు. అయితే ‘పుష్ప’ మూవీ కథ రీత్యా అంతా అరణ్య ప్రాంతంలో జరిగి తీరాలి.


మొదట్లో ‘పుష్’ షూటింగ్ ను కేరళ అడవులలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌ కోసం మేకర్స్ దాదాపుగా మూడు కోట్లవరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కరోనా వల్ల కేరళ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసి ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అటవీ ప్రాంతంలోకాని తెలంగాణలోని నల్లమల అడవులలో కాని చిత్రీకరించాలని భావించారు.


అయితే కరోనా తెలుగు రాష్ట్రాలను కూడ ఒక కుదుపు కుదిపేస్తున్న పరిస్థితులతో పాటు శేషాచలం అడవిలో కొన్ని అంతరించిపోతున్న ఎర్రచందనం చెట్లు అలాగే నల్లమల అడవికి మావోయిస్టుల ముప్పు ఉండటంతో పాటు కరోనా సమస్యలు కూడ వచ్చి పడటంతో  ప్రస్తుత పరిస్థితులలో షూటింగ్ లు మొదలైనా సుకుమార్ కోరుకున్న అటవీ ప్రాంతాలలో ప్రభుత్వ అనుమతులు ఇప్పట్లో రావు అని అంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన కథ అంతా అడవుల్లో ఎర్ర చందనం అక్రమరవాణా నేపథ్యంలో  ఉండే పరిస్థితులలో ప్రస్తుతం ఈ సినిమాను ఎక్కడ తీయాలో తెలియక ఇలా నెలల కొద్ది ఆలస్యం అయిపోతే ఈ మూవీ ప్రాజెక్ట్ కు అసలకు మోసం వస్తుందా అన్న టెన్షన్ రోజురోజుకు ఈ లాక్ డౌన్ సమయంలో సుకుమార్ కు పెరిగిపోతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: