ప్ర‌స్తుతం ర‌ష్మిక మంద‌న్న సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో బాగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఎప్పుడు అయితే ఛ‌లో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిందో ఆ సినిమా హిట్ అవ్వ‌డంతో అంద‌రి చూపులు ఒక్క సారిగా త‌న వైపున‌కు తిప్పుకుంది. ఇక ఆ సినిమా త‌ర్వాత ర‌ష్మిక తో న‌టించేందుకు ఇటు తెలుగు స్టార్ హీరోల నుంచి యువ హీరోల వ‌రకు వ‌రుస‌గా క్యూలో ఉంటున్నారు. నితిన్ ఇప్ప‌టికే భీష్మ సినిమాతో ఆమె తో న‌టించేశాడు. ఇక మ‌హేష్ బాబు ర‌ష్మిక ను చూని ఆమె తో న‌టించాల‌న్న కోరిక‌తో ఏకంగా స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో ఛాన్స్ ఇవ్వ‌డం.. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డం జ‌రిగి పోయాయి. ఇక బ‌న్నీ పుష్ప సినిమా సంగ‌తి కాసేపు ప‌క్క‌న పెడితే మ‌రో నాలుగు ఐదు యువ హీరోలు సైతం ఇప్పుడు ర‌ష్మిక తో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నార‌ట‌.

 

అటు సొంత ఇండ‌స్ట్రీ అయిన క‌న్న‌డ తో పాటు ఇటు తెలుగు ను ఓ ఊపు ఊపుతోన్న ర‌ష్మిక మంద‌న్న కెరీర్ ఒక్క సారిగా స్వింగ్‌లో ఉంది. అయితే ఇప్పుడు ఆమె క‌న్న‌డ తో పాటు అటు తెలుగు లోనూ టాప్ స్థానంపై గురి పెట్ట‌డంతో పాటు త‌మిళ్ లోనూ పాగా వేసేందుకు రెడీ అవుతోంది. త‌మిళ్ లో ఒక్క స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే చాలు.. తానేంటో ఫ్రూవ్ చేసుకుని అక్క‌డ వ‌రుస‌గా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు ద‌క్కించు కోవాల‌న్న ప్లాన్‌తో ఆమె ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. 

 

ఇక ఇప్పుడు కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తీకేయ‌న్ ప‌క్క‌న ఆమె న‌టించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. శివ కార్తీకేయ‌న్ ర‌ష్మిక ను త‌న ప‌క్క‌న ఓ సినిమాలో న‌టించాల‌ని అడిగాడ‌ట‌. ఇక ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కాని.. కొద్ది రోజులుగా వీరిద్ద‌రు ఎంతో స‌న్నిహితంగా ఉంటున్నార‌ని.. చూసిన వాళ్లు వీరు ప్రేమ‌లో ఉన్నార‌ని కూడా ప్ర‌చారం చేస్తున్నారు. అయితే మ‌రో వెర్ష‌న్ ప్ర‌కారం శివ కార్తీకేయ‌నే ర‌ష్మిక ప‌క్క‌న న‌టించే ఛాన్స్ కోసం ఆరాట ప‌డిపోతున్నాడ‌ని అంటున్నారు. ర‌ష్మిక ఈ ఛాన్స్‌ను వాడుకుని కోలీవుడ్ లో పాగా వేయాల‌ని చూస్తోంద‌ట‌.. ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: