ప్రస్తుతం దేశమంతా తీవ్ర చర్చనీయాంశమైన అంశం వలస కార్మికుల సమస్యలు. రెండు నెలలుగా దేశమంతా లాక్ డౌన్ లో ఉండడంతో వీరంతా ఉపాధి కోల్పోయారు. ఎంతో మంది తమ భార్య, బిడ్డలతో సహా వందల కిలోమీటర్లు నడుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ దృశ్యాలు దేశమంతా కదిలించాయి. ఇటువంటి సమయంలో కార్మికులను ఆదుకునేందుకు కెట్టో అనే ఎన్జీవో సంస్థ తమ వంతు బాధ్యత తీసుకుంది. ఇప్పటికే క్యాన్సర్ రోగులు, మూగ జీవాలు, అనాధలను ఆదుకునే ఈ సంస్థ కార్మికుల సమస్యల కోసం ముందుకొచ్చింది. ఇప్పుడు #stopthewalk పేరుతో ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సాయం చేశారు.  

 

 

దాతల నుంచి విరాళాలు సేకరించి కార్మికులను స్వస్థలాలను చేర్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేయడం, శానిటైజేషన్ కిట్లు అందించడం చేస్తోంది కెట్టో. ఈ సంస్థ చేస్తున్న చారిటీకి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తన వంతు సాయంగా రెండు లక్షల యాభై వేల రూపాలయను స్వచ్ఛందంగా ప్రకటించి సంస్థకు అందించారు. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇటువంటి సమయంలో అల్లు అరవింద్ స్పందించటం నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 ఇటువంట ఉదాత్తమైన పనికి దాతలెందరో ముందుకు వస్తున్నారు. వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సొంత ఊరే ఉత్తమం అనుకున్న వీరికి ట్రాన్స్ పోర్ట్ లేకపోవడం పెద్ద శాపంగా మారింది. కొంతమంది వీరికి వాహనాలు ఏర్పాటు చేస్తే మరికొంత మంది వీరికి అన్నదానం చేస్తూ ఆదుకుంటున్నారు. ఇంకా ఎంతోమంది అనేకచోట్ల స్వస్థలాలకు వెళ్లేందుకు పడిగాపులు పడుతున్నారు. ప్రముఖ నటుడు సోనూ సూద్ వలస కార్మికుల కోసం బస్సులు ఏర్పాటు చేయడం తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: