భాషా.... ఇండియన్ సినిమాలో రజని కాంత్ నటించిన ఈ సినిమా సృష్టించిన ట్రెండ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ చెప్పడం అనేది ఈ సినిమా నుంచే మొదలయింది. ఈ సినిమాలో భాషా నటన తో పాటుగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో విలన్ గా రఘువరన్ పోషించిన పాత్ర కూడా సంచలనమే. ఈ సినిమా కోసం ఇప్పటికి టీవీ ల వస్తే ప్రేక్షకులు అలా చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ఇప్పటికి కూడా ఒక సంచలనమే. ఈ సినిమా గురించి ఇప్పటికి కూడా చాలా మంది చెప్పుకుంటూనే ఉంటారు 

 

ఇక ఈ సినిమాలో రజని కాంత్ నటనకు వందకు వెయ్యి మార్కులు పడ్డాయి ఇక ఈ సినిమాలో పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి అనేది వాస్తవం. ఇక సినిమా అంటే ఇలా ఉండాలి అంటూ చాలా మంది చాలా సందర్భాల్లో ఈ సినిమా గురించి చెప్పుకున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అప్పటి వరకు ఉన్న రజని కాంత్ క్రేజ్ వేరు అక్కడి నుంచి ఉన్న రజని కాంత్ క్రేజ్ వేరు అనేది వాస్తవం. ఇక రజని కాంత్సినిమా తర్వాత ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోయారు అనేది కూడా వాస్తవం. ఈ సినిమా ఆయనకు తీసుకొచ్చిన పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 

 

విలన్ అంటే ఆ విధంగా నటించాలి అని రఘువరన్ గురించి చెప్పారు ప్రేక్షకులు. ఆ విధంగా రఘువరన్ మెప్పించారు. ఇక కథ లో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారు అనడానికి ఈ సినిమానే నిదర్శనంగా చెప్పుకుంటూ ఉంటారు సినీ ప్రేక్షకులు. ఆ విధంగా మెప్పించింది భాషా...

మరింత సమాచారం తెలుసుకోండి: