భారతీయ సినిమాలో కొన్ని సినిమాలు అలా నిలిచిపోతాయి హిట్ అయిన ఫ్లాప్ అయినా సరే కొన్ని సినిమాలు టీవీ లో వస్తుంటే ప్రేక్షకులు పనులు మానుకుని కూడా చూసే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అందులో రజని కాంత్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు చాలా మంది పనులు మానుకుని మరీ చూస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో డబ్బింగ్ అయి చాలా సినిమాలు మన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆదరించాయి కూడా. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా చంద్రముఖి. 

 

సినిమా ఒక సంచలనం అనే చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో రజని కాంత్ జ్యోతిక నటన ఒక రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ఇప్పటికి కూడా సోషల్ మీడియా లో ప్రధానంగా కనపడుతూ ఉంటాయి. ఈ సినిమాలో ఉండే కొన్ని సీన్స్ చూసి ఇప్పటికి కూడా చాలా మంది భయపడిన సందర్భాలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రజని నటన ఒక ఎత్తు అయితే జ్యోతిక ప్రభు నటన మరో ఎత్తుగా చెప్తూ ఉంటారు. ఇప్పటికి టీవీ లో వస్తున్నా సరే సినిమాను మాత్రం వదలకుండా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. 

 

మన తెలుగులో ఈ సినిమా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ద్వారా రజని కాంత్ లో ఉండే ఎన్నో కోణాలు ప్రేక్షకులు చూసారు. ఆయన ఇలా కూడా నటిస్తారా అనే విధంగా ఉంది. ఇక ఈ సినిమా కథ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది నిజమా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆ విధంగా మెప్పించింది. ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఈ సినిమా ది బెస్ట్ అంటారు ఏ భాష ప్రేక్షకులు అయినా.

మరింత సమాచారం తెలుసుకోండి: