1999వ సంవత్సరంలో స్టీఫెన్ సొమ్మెర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది మమ్మీ' సినిమా పేరుకు తగ్గట్టుగానే మమ్మీకరణ(mummification) కాబడి పూర్వీకులు పునర్జన్మ ఎత్తినట్టు ప్రేక్షకులందరికీ చూపించింది. ఈ చిత్రంలో బ్రాండెన్ ఫ్రేసర్ రిక్ పాత్రలో... రాచెల్ వీజ్ ఎవెలిన్ పాత్రలో హీరోహీరోయిన్లుగా నటించారు. మమ్మీకరణ కాబడి పునర్జన్మ ఎత్తిన ఇంహోటెప్ పాత్రలో ఆర్నాల్డ్ వోస్లూ నటించాడు. ఇతను చనిపోయిన తన ప్రియురాలిని బ్రతికేందుకు హీరోయిన్ ని బలియాలనుకుంటాడు. కానీ హీరో తన శాయశక్తులా ప్రయత్నించి హీరోయిన్ ని కాపాడుతాడు. 


అతీత శక్తులు ఉన్న ఇంహోటెప్ తన ప్రియురాలికి పునర్జన్మ కల్పించేందుకు ప్రకృతిని చిన్నాభిన్నం చేస్తుంటాడు. ఈ సన్నివేశాలన్నీ డైరెక్టర్ స్టీఫెన్ చాలా అద్భుతంగా చిత్రీకరించి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపోయేలా చేశాడు. 1932 వ సంవత్సరంలో ఇదే పేరుతో విడుదలైన సినిమాకి 1999 వ సంవత్సరంలో విడుదలైన మమ్మీ రీమేక్ కాగా... ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వేల కోట్ల రూపాయలను సంపాదించింది. మన భారతదేశంలో కూడా అనేక భాషల్లో ఈ చిత్రం డబ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. తెలుగు సినిమాలు కూడా ఈ చిత్రం ముందు చిన్నబోయాంటే అతిశయోక్తి కాదు. ఎడారి ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ అమెరికన్ హారర్ యాక్షన్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. 


రెండు గంటల ఐదు నిమిషాల నిడివితో కొనసాగిన ఈ సినిమా ని మొదట చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మిద్దామని అనుకున్నారు కానీ మళ్లీ పునరాలోచించి ఎక్కువ బడ్జెట్ తో సినిమా ని రూపొందించి వంద రెట్లు ఎక్కువ డబ్బులు సంపాదించి రికార్డులు సృష్టించారు. ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ లో కూడా ఈ సినిమా ప్రసారం అయ్యి చాలా ఎక్కువ టిఆర్పి రేటింగ్ పొందిందంటే... తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంతగా హిట్ అయిందో స్పష్టమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: