కొద్దిరోజులుగా సోష‌ల్ మీడియాలో హీరో రానా.. మిహికా బ‌జాజ్‌కు సంబంధించిన ముచ్చ‌ట్ల హ‌డావుడి మామూలుగాలేదు.. త‌న ప్రేమ విష‌యాన్ని రానా వెల్ల‌డించ‌డ‌మే ఆల‌స్యం.. ఇక అనేక వెబ్‌సైట్లు.. యూట్యూబ్ చానెళ్లు.. వారిచుట్టే తిరిగాయి. ఈ క్ర‌మంలో రానా, మిహికా కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి ఉన్న ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో నిశ్చితార్థం జ‌రిగిపోయిందంటూ రాసేశారు.. చెప్పేశారు..! క‌రోనా వైర‌స్ కార‌ణంగా సైలెంట్ పెళ్లితంతు ముగించేస్తున్నారంటూ రాశారు. ఇదంతా చూసిన రానా తండ్రి సురేశ్‌బాబు స్పందించారు. అది నిశ్చితార్థం కాద‌ని.. కేవ‌లం రోకా వేడుక అని చెప్పేశారు. అప్పుడుగానీ.. మ‌నోళ్ల‌కు అర్థమైంది విష‌యం. అయితే.. రోకా.. అనేది మ‌న తెలుగురాష్ట్రాల్లో వినిపించ‌ని మాట‌. ఇది ఎక్కువ‌గా పంజాబ్ ఉత్త‌రాది రాష్ట్రాల్లోనే ఎక్కువ‌గా వినిపిస్తుంది. రోకా అంటే మ‌న అబ్బాయి..మ‌న అమ్మాయి.. అని అనిపించుకునే తంతు అన్న‌మాట‌. ఈ సంద‌ర్భంగా ఇరు కుటుంబాల పెద్ద‌లు చిన్న‌చిన్న కానుక‌లు ఇచ్చిపుచ్చుకోవ‌డాలు చేస్తారు.

 

ఇందుకు సంబందింన ఫొటోనే అది. అయితే.. మిహికా హైద‌రాబాదీ అయినా.. ఆమె మూలాలు ముంబైలోనే ఉన్నాయి. అమె కుటుంబానికి రోకా సంప్ర‌దాయ నేప‌థ్యం ఉంది. ఆమె సంప్ర‌ద‌యాన్ని గౌర‌వించ‌డంలో భాగంగానే.. ఈ రోకా వేడుక‌ల నిర్వ‌హించార‌ట‌. నిశ్చితార్థానికి ముందు జ‌రిగే వేడుక‌గా రోకాను నిర్వ‌హించారు. అంటే పెద్ద‌లు స్వీట్లు, గిఫ్ట్స్‌ ఇచ్చి పుచ్చుకొని పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.  బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్రమంలో ఇరు కుటుంబ‌ పెద్ద‌లు నిశ్చయ తాంబూలాలు కూడా మార్చుకున్నారు. రోకా వేడుక‌లో వెంక‌టేష్ ఫ్యామిలీతో పాటు నాగ చైతన్య ఫ్యామిలీ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ద‌గ్గుబాటి ఫ్యామిలీతో పాటు బ‌జాజ్ ఫ్యామిలీ క‌లిసి దిగిన గ్రూప్ ఫోటో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.  డిసెంబ‌ర్‌లో రానా వివాహం జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, కొద్ది రోజుల ముందు నిశ్చితార్థం జ‌ర‌ప‌నున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: