చిన్ని చిన్ని ఆశ.. ఈ పాట తెలియని వారే ఉండరు. అలాంటి పాటనిచ్చిన సూపర్ సినిమా రోజా. ఇంకా ఎంతో అద్భుతమైన కథను ఎంత అందంగా చూపించిన సినిమా ఇది. దేశం కోసం ఒక మాములు వ్యక్తి పడే తపన.. తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా వెనకాడరు. ఎంతో అందంగా ఈ కథను చూపించిన సినిమా ఇది. 

 

తమిళ్ వర్షన్ లో తీసిన ఈ సినిమా ఎంతో తెలుగులో, హిందీ లో కూడా సూపర్ హిట్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. దేశం కోసం ఒక కామన్ మ్యాన్ పడే కష్టం.. అతని కోసం అతని భార్య పడే తపన అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. 

 

మణిరత్నం సినిమాలు అంటేనే ప్రేమ ఉంటుంది.. రొమాన్స్ ఉంటుంది.. పగ ఉంటుంది.. ఇలా అన్ని ఉంటాయి. ఇంకా ఈ సినిమాలో ఉన్న హీరో ఆడపిల్లల డ్రీమ్ బాయ్ అయ్యాడు అంటే నమ్మండి. అరవింద్ స్వామి ఎంత అందంగా ఉంటాడు.. ఇంకా ఈ హీరోయిన్ చిన్ని చిన్న ఆశ అంటూ వచ్చే పాటలో ఎంత ముద్దుగా ఉంటుందో.. 

 

పరువంగానా పాటలో అంత రొమాంటిక్ లుక్ లో కనిపిస్తుంది. అందం అభినయం రెండు కలిసిన హీరోయిన్.. అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ మధుబాల అంటే నమ్మండి. ఇంకా అలాంటి రోజా ఇప్పటికి ఫ్రెష్ గానే ఉంటుంది. సినిమా ఏంటి ఇది 1991 లో తీశారా? అయినా చాలా కొత్తగా ఉందే అనిపించేలా ఉంటుంది సినిమా. ఏది ఏమైనా మణిరత్నం దర్శకత్వం ఏఆర్ రెహమాన్ సంగీతం కాంబినేషన్ లో సినిమా వస్తే ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.                        

మరింత సమాచారం తెలుసుకోండి: