తెలుగు చలన చిత్రాలు ఎప్పుడు కొత్తదనాన్ని చూపిస్తాయి. ఆ చూపించడం కూడా ఎంతవరకు అంటే ప్రేమ సీన్లు ఉంటే బ్రేకప్ చెప్పడమో, లేక లవ్ ఉంటే కోరికలు తీర్చుకోవడమో, ఫ్యామిలీ మధ్య సంభాషణలు చూపించడమో, అది లేదంటే దెయ్యం పట్టింది అంటూ హర్రర్ ప్రయోగానికి తెర లేపడమో, ఇది కూడా వర్క్ అవుట్ కాకుంటే రోబో లాంటి సైన్స్ పెంపొందించే సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ఇకపోతే ఈ మధ్య కొత్తగా మీతిమీరిన అందాలతో, డబల్ మీనింగ్ డైలాగులతో సినిమాలను తెరకెక్కిస్తుంటారు.

 

 

 

ఇక ఆ సినిమాలు కూడా రిలీజ్ అయ్యి , పెద్దగా ఏమి లేదండి అనే పబ్లిక్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అదే తంతు జరుగుతూనే వస్తుంది. డైరెక్టర్లు ఎంత కష్టపడి కోట్లు గుమ్మరించిన కూడా సినిమాకు  కనీస కలెక్షన్లను కూడా రాబట్టలేక నష్టం తప్ప మరేమి మిగలదు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ వాకిట్లో జరుగుతున్న వాస్తవం. ఇక్కడ ఆఫర్లు రాలేవని కొందరు బ్యూటీస్ బాలీవుడ్ కో లేక కోలీవుడ్ కో చెక్కేస్తుంటారు. 

 

 

 

విషయానికొస్తే.. టాలీవుడ్ కు హాలీవుడ్ కు వ్యత్యాసాలను గమనిస్తే, టాలీవుడ్ సినీ జనాలు తీసిన సినిమానే తిప్పి తిప్పి, పిప్పి అయ్యేవరకు తీస్తూనే ఉంటారు. కానీ, హాలీవుడ్ మాత్రం ఎప్పుడు ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటుంది. ఆ సినిమాలు కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న కూడా వాటికొచ్చే బడ్జెట్ కూడా అలానే ఉంటుంది. అక్కడ సినిమాలు కూడా ఒక థీమ్ తో తెరకెక్కుతాయి. అలా చుస్తే హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు డీలా పడిన కూడా మరి కొన్ని సినిమాలు రికార్డులను బ్రేక్ చేసినవే. అలాంటి సినిమాలు చాలానే వస్తున్నాయి.. అయితే ఇప్పుడు చాలా హిట్ ను సొంతం చేసుకోవడమే కాదు బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది.  అందుకే సినిమాలు ఎన్నో వస్తున్నాయి..టైటానిక్ సినిమా ప్రేక్షకులను అలరించింది.  అయితే సినిమా లో రొమాన్స్ సీను మాత్రం హైలెట్ దీంతోనే షిప్ మునిగిపోయింది.. దీంతో సినిమా అన్నీ భాషల్లో హిట్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: