కేజీఎఫ్.. ఏంటి ? ఏం ఎఫ్? అని అందరూ వింతగా అడిగారు. కానీ ఆ సినిమా చూశాక అందరూ వావ్ అని అన్నారు. అంతబాగుంది సినిమా. స్టోరీ అంత కూడా పవర్ గురించే.. కానీ అమ్మ ప్రేమ గురించి.. అమ్మ చెప్పిన దైర్యం చాలా బాగుంది. సినిమాలో అమ్మ పాట ఇంకా సూపర్ హిట్. అసలు ఈ సినిమా కన్నడ డబ్బింగ్ అంటే మన తెలుగు వాళ్ళు నమ్మలేకపోయాను. 

 

సినిమా ఓవర్ అల్ గా బాగుంది. ప్రేమ, పగ, ఫైట్స్, రొమాన్స్, తల్లి ప్రేమ, థ్రిల్లర్, సస్పెన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయ్ అంటే నమ్మండి. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత బాహుబలి తర్వాత అంత అద్బుతమైన సినిమా లేదు.. కానీ కన్నడ ఇండస్ట్రీలో ఇంత అద్భుతమైన ఫిల్మ్ వస్తుంది అని ఎవరు ఊహించలేదు మరి. 

 

అంతేకాదు ఈ సినిమాలో గోల్డ్ మైన్స్, విలన్స్, సినిమాలో పాత్రలు సినిమాకు జీవం పోశాయ్ అంటే నమ్మండి. ఎంతో అద్భుతమైన సినిమా ఇది. ఇంకా ఈ సినిమా పార్టీ 2 ఈ సమ్మర్ లో విడుదలవ్వాల్సింది. కానీ ఈ కరోనా వైరస్ కారణంగా సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని వచ్చే సంవత్సరంలో విడుదల చేస్తున్నారు. 

 

సెకండ్ పార్ట్ కోసం కేవలం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది చూడాలి. నిజానికి ఈ సినిమాలో హీరో తెలుగు వాళ్ళకే కాదు కన్నడ ప్రేక్షకులకు కూడా పెద్దగా తెలియదు. అలాంటిది ఈ సినిమాతో ఈ హీరో పేరు మారుమోగిపోయింది.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: