మన తెలుగులో చాలా వరకు తమిళ సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. సినిమా అక్కడ విడుదల అయింది అంటే చాలు తెలుగులో కచ్చితంగా వస్తుందా లేదా అనేది ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగులో తమిళ సినిమాలకు మంచి ఆదరణ ఉండటం తో ఇక్కడి దర్శక నిర్మాతలు కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి సారించి హక్కులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేది వాస్తవం. ఇక మన తెలుగులో కొందరు హీరోలకు మంచి క్రేజ్ ఉంది అనే విషయం తెలిసిందే. ఇక మన తెలుగులో బాగా హిట్ అయిన తమిళ హీరో ఆర్య. 

 

అతని సినిమా ఏది వచ్చినా సరే యువత బాగా ఆదరించే పరిస్థితి ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఇక ఆర్య సినిమాల్లో కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చిన సినిమా ఒకటి ఉంది. అదే రాజా రాణీ. ఈ సినిమాను మన తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు కూడా. ఈ సినిమాలో ఆర్య నటన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక హీరోయిన్ గా నటించిన నయనతార కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది అని విమర్శకులు కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆమెకు తెలుగులో ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. 

 

సినిమా అతేలుగులోనే కాదు తమిళంలో కూడా వసూళ్లు బాగానే సాధించింది. ఈ సినిమా తర్వాత ఆర్య కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక అమ్మాయిలూ కూడా అతని సినిమాల కోసం ఎక్కువగా ఎదురు చూసారు. ఆ సినిమాలో ఆర్య నటనకు తమిళంలో అవార్డులు కూడా వచ్చాయి. సినిమాను కొనుగోలు చేసిన నిర్మాతలు కూడా ఇక్కడ బాగానే లాభ పడ్డారు అనే విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత అతను తెలుగులో పెద్దగా సినిమాలు విడుదల చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: