సాధారణంగా రజని కాంత్ సినిమా అనగానే ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు కచ్చితంగా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. సినిమా వస్తుంది అంటే చాలు పనులు మానుకుని కూడా చూస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాల్లో మన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటీ అంటే నరసింహ భాషా రోబో.. శివాజీ సహా పలు సినిమాలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ఈ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ఒకటి ఉంది. రోబో... రజని కాంత్ 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ సినిమా చేసారు. 

 

సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా లో ఆయన నటన యువ నటులకు మించి ఉంది. ఆయన ఎంతో యాక్టివ్ గా నటించడమే కాదు అన్ని భాషల ప్రేక్షకులను కూడా తన సినిమా ద్వారా కట్టిపడేశారు అనేది వాస్తవం. ఈ సినిమా ఇండియన్ సినిమాలో ఎన్నో సంచలనాలకు వేదికగా మారింది. ఈ సినిమాలో రజని నటనకు అవార్డులు కూడా వచ్చాయి. ఆయన రోబో గా విలన్ గా ఈ సినిమాలో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా తర్వాత ఆయన సినిమాల కోసం బాలీవుడ్ లో కూడా ఎదురు చూసారు అనేది వాస్తవం. 

 

సినిమా ఆ విధంగా ప్రేక్షకులను మెప్పించింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం చాలా మందిని ఇబ్బంది పెట్టాయి అనేది అర్ధమైంది. ఆ సినిమా లు అంతగా ఆకట్టుకోలేదు. కబాలి సహా పేట వంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టాయి సినిమా హక్కులను కొనుగోలు చేసిన వారికి నష్టాలు కూడా మిగిల్చాయి అనేది వాస్తవం. ఇప్పుడు ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: