రజని కాంత్ సినిమా అనగానే మన తెలుగు ప్రేక్షకులు చాలా మంది థియేటర్ కి ముందే వెళ్లి కూర్చునే పరిస్థితి ఉంటుంది. వాటికి మన తెలుగులో జరిగే మార్కెట్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా విడుదల అవుతుంది అనగానే ప్రేక్షకులకు ఒక పిచ్చి కూడా ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఆయన సినిమాలకు ఏ స్థాయిలో ఆదరణ ఉంటుందో గాని మన తెలుగులో మాత్రం ఆయన సినిమాలు అనగానే పడి చస్తారు ప్రేక్షకులు. అయితే కొన్ని సినిమాలు ఆయన అభిమానులతో పాటుగా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా నిరాశకు గురి చేసాయి అనేది వాస్తవం. 

 

ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమాకు వెళ్ళగా సినిమాలు చాలా వరకు ఈ మధ్య కాలంలో బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనే చెప్పవచ్చు. ఈ మధ్య ఆయన సినిమాలు బాగా ఇబ్బంది పెట్టిన వాటిలో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా 2.o. ఈ సినిమా రజని ఫాన్స్ ని కూడా ఏడిపించింది. రోబో తర్వాతి వెర్షన్ గా వచ్చిన ఈ సినిమా చిన్న పిల్లలు ఆడుకునే గేమ్ షో మాదిరి ఉందని అన్నారు. దర్శకుడు శంకర్ కూడా ఈ సినిమా విషయంలో ఎంతో బాధ పడిన సందర్భం ఉందని ఆ సినిమా ఆ విధంగా నిరాశ పరిచింది అని నిర్మాత బాగు పడినా సరే సినిమాను కొనుక్కున్న వారు మాత్రం బాగా ఇబ్బంది పడ్డారు. 

 

ఈ సినిమాను అనవసరంగా కొనుగోలు చేసామని చాలా మంది బహిరంగంగానే రాణి సినిమాల మీద విమర్శలు చేసారు. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన సినిమాలకు మార్కెట్ కూడా పెద్దగా జరగడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అయిన సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: