ప్రస్తుతం భారత సినీ ప్రేక్షకులందరికీ ధూమ్ సిరీస్  సినిమాలు ఎంత ఫేవరెట్గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సినిమాలు.. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ధూమ్ సిరీస్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చినప్పటికీ మూడు సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. ఇక బాలీవుడ్ హీరోలకు ఎంతగానో గుర్తుకు తెచ్చిపెట్టాయి . కేవలం బాలీవుడ్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఈ సినిమాలు హీరోలకి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ధూమ్ సిరీస్ లో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించిన సినిమా ఏదంటే ధూమ్ 2. పోలీసు పాత్రలో అమితాబ్ బచ్చన్... దొంగ పాత్రలో హృతిక్ రోషన్ ఐశ్వరరాయ్ నటించిన ఈ సినిమా తెలుగులో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

 

 డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తెలుగులో కూడా  ఘన విజయం సాధించింది  అని చెప్పాలి. ఈ సినిమాలో హృతిక్ రోషన్ చేసే యాక్షన్ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులను అబ్బుర పరిచాయి అనే చెప్పాలి. ఇక హృతిక్ రోషన్ దొంగతనాలు చేసేందుకు  వేసే ఎత్తులు పైఎత్తులు ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అంతేకాకుండా ఐశ్వర్యరాయ్ హృతిక్ రోషన్ మధ్య జరిగే రొమాంటిక్ లిప్ లాక్ సీన్లు కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తుంటాయి . 

 

 అయితే ధూమ్ 2 లో ఐశ్వర్య రాయ్ హృతిక్ రోషన్ మధ్య వచ్చే లిప్ లాక్ సీన్ గురించి ఎన్నో రోజుల పాటు చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య డీప్ లిప్ లాక్ సీన్లు ధూమ్ 2 సినిమా లో ఉంటాయి. అయితే ధూమ్ 2 సినిమా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమా ను ఆదరించిన దానికంటే  ఎక్కువగా ఆదరించి  మంచి విజయం సొంతం చేసుకునేలా చేశారు. ఇక ఈ సినిమా హృతిక్ రోషన్ కు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో అప్పటి నుంచి రుతిక్ రోషన్ కి సంబంధించి ఏదైనా సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: