టాలీవుడ్ లో తమిళ సినిమాలను బాగానే ఆదరిస్తూ ఉంటారు. అక్కడి సినిమాలను ఇక్కడి ప్రేక్షకులు ఎక్కువగానే చూస్తూ ఉంటారు. అక్కడి చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే మన వద్ద మాత్రం మంచి సినిమా అయితే ఆదరణ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇక విజయ్ సినిమాలకు మన తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. చిన్న చిన్న సినిమాలు అయినా పెద్ద సినిమాలు అయినా సరే అతని సినిమా వచ్చింది అంటే చాలు కచ్చితంగా చూస్తూ ఉంటారు. ఇక అతని సినిమాలు తమిళంలో హిట్ అయినా లేకపోయినా తెలుగులో మాత్రం హిట్ అవుతూనే ఉంటూ ఉంటాయి. 

 

అతని సినిమాల్లో ఈ మధ్య కాలంలో మంచి విజయం సాధించిన సినిమా తుపాకి. ఈ సినిమా కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అనే చెప్పవచ్చు. కథ బాగా నచ్చడం తో ప్రేక్షకులు ఆ సినిమాను హౌస్ ఫుల్ రేంజ్ లో వీక్షించారు అనేది తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతనికి మన తెలుగులో మంచి డిమాండ్ అనేది వచ్చింది. అతని సినిమా వచ్చింది అంటే కచ్చితంగా మొదటి రోజు చూసే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. ఇప్పుడు అతని సినిమాలు ఎప్పుడు వస్తాయా అని కూడా ప్రేక్షకులు చూస్తున్నారు. ఇక తమిళంలో అతనికి ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో క్రేజ్ ఉంది. 

 

ఇప్పుడు అతని సినిమాలు ఎక్కువగా రావడం లేదు. ఈ మధ్య అతని కొన్ని సినిమాల విషయంలో కేంద్రం ఆగ్రహంగా ఉండటం తో ఇతర భాషల్లో విడుదల కావడానికి ఇబ్బంది బాగా పడుతున్నాయి. తుపాకి సినిమా తెలుగులో మంచి వసూళ్ల ను కూడా సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా విజయ్ మన తెలుగు హీరో అని కూడా చెప్పుకున్నారు కొందరు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: