తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ అంటే చిరంజీవి అనేది వాస్తవం. అంతలా ఆయన డ్యాన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన అభిమానుల్లో చాలా మంది ఆయన డ్యాన్స్ చూసే ఆకర్షితులైయ్యారు. తెలుగు చిత్ర సీమలో తనదైన డ్యాన్స్ తో ఒక విధమైన ట్రెండ్ సెట్ చేసిన ఘనత చిరంజీవి సొంతం. అందుకే ఆయన సినిమాల్లో పాటలపై ప్రత్యేక శ్రద్ద చూపించేవారు దర్శక, నిర్మాతలు. సెట్ లో ఎలాంటి ట్యూన్ పెట్టినా ఏ విధమైన రిహార్సల్స్ లేకుండానే పాటకు తగ్గట్టు స్టెప్స్ వేసి అందరిని అబ్బుర పరిచేవారు. 

 

సినిమా చరిత్రలో అద్భుతమైన నటుడు చిరంజీవి. 90 లలో ఆయన వేసిన డ్యాన్స్ లకు థియేటర్ లలో ప్రేక్షకులు ఉర్రూతలూగి పోయేవారు. అయితే డ్యాన్స్ పరంగా చిరుకి పేరు తెచ్చిన పాటల్లో ఇంద్ర సినిమాలోని  దాయి దాయి దామ్మ సాంగ్. ఈ పాట షూటింగ్ స్విట్జర్లాండ్లో జరుపుకుంది. అయితే ఈ పాటలోని వీణ స్టెప్పు తీసే సమయానికి అక్కడ విపరీతమైన మంచు వర్షం కారణంగా షూటింగ్ ని వాయిదా వేసారు చిత్ర యూనిట్. కాని చిరంజీవి మాత్రం డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ని తన రూమ్ కి పిలిపించుకుని ఎముకలు కొరికే చలిలో సైతం దాదాపు అయిదు గంటలు రిహార్సల్స్ చేసారు. 

 

చిరంజీవికి పని పట్ల ఉన్న శ్రద్ద, అంకిత భావం అలాంటివి కనుక అంత చలిలో కూడా ప్రాక్టిస్ చేసారు. అంతటి స్థాయిలో ఉన్న ఏ హీరో అయినా ఆ చలిలో మంచం దిగేవారు కాదు అని ఆ సినిమా దర్శకుడు బి గోపాల్ ఒక ఇంటర్వ్యులో తెలియచేసారు.  అలాగే గతంలో కూడా స్టేట్ రౌడి సినిమాలో చిరంజీవి డ్యాన్సులకు తగ్గట్టు స్కోప్ ఉన్న పాటలని పెట్టిoచామని, అవన్నీ సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. ఏది ఏమైనా చిరంజీవికి నటన పట్ల ఉన్న శ్రద్ద, అంకిత భావమే ఆయన్ని మెగా స్టార్ గా నిలబెట్టింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: