ఇప్పుడు మన తెలుగులో హీరోయిన్ లకు మంచి డిమాండ్ ఉంది. కొత్త కొత్త హీరోయిన్ లకు అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం చదువుతూనే ఉన్నాం. ఈ నేపధ్యంలోనే కొందరు టిక్ టాక్ అమ్మాయిల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. టిక్ టాక్ అమ్మాయిల కోసం స్టార్ దర్శకులు కూడా చూస్తున్నారు. వాళ్ళను సినిమాల్లోకి తీసుకుని అవకాశాలు ఇస్తే పారితోషికం కూడా ఎక్కువగా డిమాండ్ చేసే అవకాశం ఉండదు అని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. 

 

అందుకే ఇప్పుడు టిక్ టాక్ అమ్మాయిలతో దర్శక నిర్మాతలు మాట్లాడటానికి గానూ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న వారి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఒక దర్శకుడు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అతిక టాక్ వీడియో లు చూస్తూ అమ్మాయిల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. మరి ఎవరికి అవకాశం ఇస్తాడు అనేది త్వరలోనే తెలుస్తుంది. సదరు దర్శకుడు తమిళనాడు కి చెందిన ఒక అమ్మాయిని ఎంపిక చేసాడు అని సమాచారం. అదే విధంగా విశాఖ కు చెందిన ఒక అమ్మాయి కోసం కూడా అతను ప్రయత్నాలు చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఆమె తో ఇప్పటికే అతను మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. 

 

ఆమె కూడా సినిమాను చేయడానికి ఓకే చెప్పింది అని అంటున్నారు. వచ్చే ఏడాది నిర్మాతలు చాలా వరకు తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలనే చెయ్యాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ ప్రయత్నాలు అని సమాచార౦. ఇక స్టార్ హీరోలకు కూడా సరిపోయే అమ్మాయిలను టిక్ టాక్ లో వెతుక్కునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  ప్రస్తుతం టాలీవుడ్ లో దీని గురించి అనేక చర్చలు జరుగుతున్నాయి. మరి ఎవరు నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: