టాలీవుడ్ లో ఇప్పుడు యాంకర్స్ కి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. యాంకర్స్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో వాళ్ళతో సినిమాలు చేయడానికి గానూ ఎక్కువగా ముందుకు వస్తున్నారు. వాళ్ళు అయితే సినిమాకు ఎక్కువగా ప్రచారం చేస్తారు అని దాని వలన మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది అనే భావన లో ఉన్నారు ఇప్పుడు కొందరు. అందుకే అనసూయ సహా రేష్మీ కి అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. 

 

ఇక అనసూయ ఇప్పటికే సినిమాలతో బిజీ గా ఉంది. ఇప్పుడు రేష్మీ అయితే చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని సమాచారం. ఆమె పారితోషికం అంతగా డిమాండ్ చేయకపోవడం తో చాలా మంది దర్శక నిర్మాతలు ఆమె తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆమె కూడా ఇప్పుడు మన తెలుగులో సినిమాలు ఎక్కువగా  చేయడం తో పాటుగా తమిళ సినిమాల మీద కూడా కాస్త ఫోకస్ పెట్టింది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. మరి అక్కడి సినిమాల్లో ఆమె నటిస్తుందా లేదా అనేది తెలియదు. 

 

ఇక ఇప్పుడు ఆమె కోసం ఒక యువ దర్శకుడు ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజం ఎంతో గాని దీని గురించి మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఎక్కువగా టాలీవుడ్ ఓ యాంకర్లకు అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉన్న ఆమె కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరి ఎంత వరకు నిజమో గాని కొన్ని రోజులు ఆగితే గాని స్పష్టత అనేది రాదు. కాగా ఇప్పుడు ఆమె యాంకర్ గా ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: