మన తెలుగులోనే కాదు ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉంది అనేది వాస్తవం. అతని తో సినిమా చేయడానికి గానూ అక్కడి దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అతని సినిమాలు అనగానే బాహుబలి తర్వాత ఒక రేంజ్ లో ప్రేక్షకులు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను హాలీవుడ్ కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అక్కడి ఒక యాక్షన్ సినిమాలో అతన్ని ఎంపిక చేసారని సమాచారం. అమెరికా ప్రభాస్ వెళ్ళిన సమయంలో దీని గురించి చర్చ కూడా జరిగింది అని అంటున్నారు. 

 

సినిమా కోసం ప్రభాస్ మూడు నెలల పాటు అమెరికాలో కూడా ఉండాలని అంటున్నారు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ విమానాలు లేవు కాబట్టి అతను వెళ్ళడం లేదని సమాచారం. అతను అక్కడ సినిమాలు చేయడానికి ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నాడు కూడా. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావడం ఖాయమని అంటున్నారు. అయితే ఆ సినిమాలో ప్రభాస్ విలన్ గా నటించే అవకాశం ఉందని అతని పాత్ర ఎక్కువ సేపు ఉండదు అని కాకపోతే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ కాబట్టి... 

 

అతన్ని తీసుకున్నారు అని సమాచారం. నిజం ఎంత వరకు ఉందో గాని ఇప్పుడు మాత్రం దీనిపై ఎంతో చర్చ జరుగుతుంది. ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ అనేది బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తెలుగులో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా హిట్ అయింది అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: