సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గా వెలుగొందిన అందాల నటి భానుమతి గారు. ఆమె నటించిన అన్ని సినిమాల్లో తన పాటలను తానే పాడుకునేవారు. ఆ గాత్రం వినటానికి వినసొంపుగా ఉండేది. ఆ తర్వాత అలాంటి హీరోయిన్లు మళ్లీ కనిపించలేదు. కానీ ప్రస్తుత జనరేషన్ లో వస్తున్న హీరోయిన్స్ వారి అందంతో పాటు వారి గాత్రాన్ని వినిపించి మెప్పిస్తున్నారు మరియు శభాష్ అనిపిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో పరిచయమున్న కొందరు అందాల  బామ్మలు వారి సినిమాల్లో వారి పాటలను పాడి వినిపించారు.  వాళ్లలో  ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం.

 స్వాతి రెడ్డి:

IHG

 ఈమె మా టీవీ కలర్స్ ప్రోగ్రాం లో అందరికీ సుపరిచితురాలు. ఆ తర్వాత డేంజర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈమె పలు తెలుగు, తమిళం చిత్రాలలో నటించి మెప్పించింది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రోత్సాహంతో తెలుగు ప్రజలకు  గుర్తుండి పోయేలా స్వాతి కూడా పాట పాడింది. 100% లవ్ సినిమాలో... ఏ స్క్వేర్ బి స్క్వేర్.... పాట పాడి తెలుగు ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఆ తర్వాత స్వామి రారా సినిమా లో..... యే యే యే  మేము అంతా... అంటూ తన గళాన్ని మరోసారి విప్పింది. ఆ తరువాత... కథ  స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాలో... అన్బిలీవబుల్... అనే సాంగ్ ని పాడి మెప్పించింది.

 

 మమతా  మోహన్ దాస్:

IHG

 

 యమదొంగ లో గ్లామరస్ హీరోయిన్ గా పరిచయమైన మమతా మోహన్   దాస్ ను సైతం గాయనిగా పరిచయం చేసిన ఘనత దేవి శ్రీ ప్రసాద్ దే. ఈమె మొదటి సారిగా రాఖీ సినిమా లో.. రాఖీ రాఖీ రాఖీ నా  కవాసాకి... అంటూ పాట పాడి తెలుగు ప్రేక్షకులను మరియు ఎన్టీఆర్ అభిమానులను మెప్పించింది. ఆ తరువాత పలు సినిమాలలో పాటలు పాడి మెప్పించింది. శంకర్ దాదా ఎం బి బి ఎస్ లో... ఆకలేస్తే అన్నం పెడతా, కింగ్ సినిమాలో...  ఏ ఐ ఎన్ జి వస్తున్నాడు కింగ్, యమదొంగ లో... ఓలమ్మితిక్కరేగిందా, చందమామ సినిమాలో సక్కుబాయి నే, జగడం సినిమాలో ..36 -24 -36 సాంగ్ ని, అదేవిధంగా తమిళ, మలయాళ భాషల్లో కూడా పాటలు పాడింది.

ఆండ్రియా జెరెమియా:

యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి ఆండ్రియా జెరెమియా. ఆ తరువాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటించి తన గ్లామర్తో ప్రేక్షకులను మెప్పించింది. దేవీసతిప్రసాద్ సంగీత సారధ్యంలో బొమ్మరిల్లు సినిమాలో "వి హావ్ ఎ రోమియో" అను పాటతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, తాజాగా భరత్ అనే నేను సినిమాలో ... "ఇదేదో కలాలా వన్నాధే" అనే పాటతో తెలుగు ప్రేక్షకులను మైమరపింపజేసింది. 


 నిత్యా మీనన్:

IHG
 అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన క్యూట్ లేడీ నిత్య మీనన్. అదే సినిమాకు ఆమె సింగర్ గాను పరిచయమైంది. ఆ సినిమాలో "అమ్మమ్మో.. అమ్మో.. అమ్మాయి..." అనే పాటను పాడి మెప్పించింది అదేవిధంగా తమిళంలో.. ఐదేండ్ల  ఐదు సినిమాలో కూడా ఓ పాట పాడింది.... ఇష్క్ సినిమా లో... ఓ ప్రియా ప్రియా, గుండెజారి గల్లంతయిందే సినిమాలో.. తుహీరే.. పాటను పాడి సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు తమిళ భాషల్లో ఈమె పలు పాటలను పాడింది.

 శృతి హాసన్:

IHG's LKG- <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='cinema-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cinema</a> express

 కమల్ హాసన్ కుమార్తె గా వెండితెరకు పరిచయం నటి శృతి హాసన్. సినిమాల్లోకి ప్రవేశించక ముందు ఆమె సంగీతం నేర్చుకుని తన తండ్రి సినిమా అయిన ఈనాడు అనే సినిమాలో మ్యూజిక్ కంపోజర్ గా పరిచయం అయ్యింది. చిన్న వయసు నుంచే సినిమా నేపథ్య గాయని గా పాటలు పాడడం స్టార్ట్ చేసింది. కమల్ హాసన్ నటించిన క్షత్రియ పుత్రుడు,  హీరామ్, భామనే సత్య భామనే తదితర  సినిమాల్లో పాటలు పాడి... హీరోయిన్ గా తన ప్రయాణం ప్రారంభించిన తర్వాత కూడా.... సెవెన్ సినిమాలో.. ఏలేలమా... ఓ మై ఫ్రెండ్ సినిమా లో... శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అనే పాటను, రేసుగుర్రం సినిమాలో... డౌన్ డౌన్ డౌన్  డప్పా.. అనే పాటను పాడింది. దాదాపు ఈమె తెలుగు తమిళ సినిమాలలో 30కిపైగా పాటలను పాడింది.


 రాశి కన్నా:

IHG

 ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత సినిమా లోనే ఛాన్స్ కొట్టేసింది సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది. బాలకృష్ణుడు సినిమాలో .. తారీరా... జవాన్ సినిమా లో... బంగారు... అనే పాటలను పాడి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది

 మంచు లక్ష్మి:

IHG

 డైలాగ్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి. ఈమె హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. దొంగాట సినిమాలో... ఏందిరో.... పాట పాడి  మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. మేము సైతం అనే స్పెషల్ టీవీ ప్రోగ్రాంలో టైటిల్  సాంగును ఆమె పాడింది.

 అంజలి:

IHG

 షాపింగ్ మాల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది అంజలి. ఆ తర్వాత వచ్చిన జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. చిత్రాంగద సినిమాలో ఓ పాట పాడి గుర్తింపు తెచ్చుకుంది.


 శ్రద్ధా కపూర్:

IHG
 టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ సరసన సాహో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి శ్రద్ధా కపూర్. ఈమె  బాలీవుడ్ లో ప్రముఖ కథానాయకుల లో ఈమె ఒకరు. ఈమె నటిగా మాత్రమే కాకుండా పలు చిత్రాలలో పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించింది. నటించిన చిత్రాలకు ఆమె ప్లే బ్యాక్ పాటలు పాడటం విశేషం. ఏక్ విలన్ సినిమాలు....  గల్లియన్ , ది హామ్లెట్  రీమేక్ నుండి దో జహాన్, ఏబిసిడి2 నుండి బేజుబాన్  .... అదేవిధంగా టైగర్  ష్రాఫ్  నటించిన  భాగి చిత్రంలో ..సబ్ తేరా ..అనే పాటను పాడింది.


 ఆలియా భట్:

IHG

 కరణ్ జోహార్  నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు. మెయిన్   తేను సంజవాన్ పాటను పాడి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. ఈమె పలు చిత్రాలలో ప్లే బ్యాక్ సింగర్ గా గుర్తింపు పొందింది.


 సోనాక్షి సిన్హా:

IHG


 నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది సోనాక్షి సిన్హా. ప్రస్తుతం ఈమె సొంతగా ఆల్బమ్ సాంగ్స్ ను రిలీజ్ చేసే యోచనలో ఉంది. ఇటీవల తన మొదటి పాటఆజ్ మూడ్ ఇష్ఖోలిక్ హై అనే పాటను టి సిరీస్ ద్వారా విడుదల చేసింది.

 

 ప్రియాంక చోప్రా:

IHG

 విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్న అంతర్జాతీయ సూపర్ స్టార్, నిర్మాత మరియు గాయని ప్రియాంక చోప్రా. ఈమె పలు హిందీ సినిమాలలో పాటలు పాడి ప్రేక్షకులను  మైమరపించే పనిలో పడింది.... ఇంకా చోప్రా పాడిన ఈ సంగీతం వింటే మది ఊహల్లో తేలినట్లు ఉంటుంది. ప్రియాంక చోప్రా నటించినటువంటి మేరీకోమ్ చిత్రంలో ... దిల్ ధడక్నే దో..... పాట ఎంతగానో ఆకర్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: