ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న పూజా హెగ్డే... అటు తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి అవకాశాలను అందిపుచ్చుకొని తన హవా నడిపిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కెరీర్ పరంగా దూసుకుపోతున్న పూజా హెగ్డే కు సరైన పోటీ లేదు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా హెగ్డే. ఏ స్టార్ హీరో కి జోడీగా అయిన పూజా హెగ్డే సెలెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు దర్శకనిర్మాతలు. 

 


 ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది నటించేందుకు సిద్ధం అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా మరో సినిమాకు కూడా పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమగాధ , పడి పడి లేచే మనసు లాంటి సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో అయినా దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ తెలుగు సినిమా తెరకెక్కుతుంది. మామూలుగానే హను రాఘవపూడి సినిమాలంటే అందరికంటే భిన్నంగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుంది అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. 

 


 కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా  ఎవరిని  సెలెక్ట్ చేస్తారు అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉండగా.. ప్రస్తుతం ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే ని సెలెక్ట్ చేసిందట  చిత్ర బృందం. కాగా ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందించబోతున్నారు. మొన్నటికి మొన్న టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సరసన అలా వైకుంఠపురములో సినిమాలో నటించి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్లో రెబల్ స్టార్  ప్రభాస్ 20వ సినిమా లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం పూజా హెగ్డే కెరియర్కి ఎంతగానో కలిసొచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: