ఇప్పుడు మన తెలుగులో చాలా మంది యువ హీరోలు అవకాశాలు వస్తాయా రావా అనే ఆందోళనలో ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత మన తెలుగులో సినిమాల భవిష్యత్తు ఏంటీ అనే ఆందోళన చాలా మందిలో ఉంది. సినిమాలు ఏ విధంగా ఉంటాయో వాటి భవిష్యత్తు ఏంటీ అనేది చాలా మందిలో ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇక యువ హీరోలు అయితే తమ భవిష్యత్తు విషయ౦ లో ఎం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. మన తెలుగులో ఇప్పుడు దర్శక నిర్మాతలు చాలా వరకు నష్టపోయారు అనేది వాస్తవం. ఇప్పుడు యువ హీరోలతో సినిమాలు చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. 

 

ఈ తరుణంలో స్టార్ హీరోలు కొందరు కీలక అడుగులు వేస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు స్టార్ హీరోలు సినిమాల నిర్మాణం మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే ఈ నేపధ్యంలోనే రామ్ చరణ్ చిన్న హీరోలతో వరుసగా సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నాడు. సైరా సినిమా అతనికి చాలా నష్టాలు ఇచ్చింది అని ఇప్పుడు ఆచార్య లేట్ అవ్వడం కూడా అతనికి పెద్ద దెబ్బ అని అందుకే ఇప్పుడు చిన్న హీరోలతో లో బడ్జెట్ ఉండే సినిమాలను చేసి నష్టాల నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. మన తెలుగులో తనకు  నిర్మాతగా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇక ఇప్పుడు నానీ సహా నిఖిల్ వంటి హీరోలతో సినిమాలను ప్లాన్ చేసి హీరో గానే కాదు నిర్మాతగా కూడా బిజీ అయ్యే ప్రయత్నాలను చేస్తున్నాడు. మరి అవి ఎంత వరకు ఫలిస్తాయి అనేది చూడాలి. శర్వానంద్ తో తనకు స్నేహం ఉంది కాబట్టి అతన్ని లైన్ లో పెట్టాడని త్వరలోనే అతని తో సినిమా చేస్తాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: