మామూలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ భాషలకు చెందిన సినిమాలు డబ్ అవుతూ  ఉంటాయి అనే విషయం తెలిసిందే. ఇక ఆయా సినిమాలు తెలుగులో కూడా భారీ విజయాలను సాధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా సినిమాలో కథ బలంగా ఉంటే తెలుగు ప్రేక్షకులు వివిధ భాషలకు చెందిన సినిమాలు అయినా సరే బాగా ఆదరిస్తూ ఉంటారు. ఈ విషయం ఎన్నో సినిమాల విషయంలో నిరూపించబడింది కూడా. వివిధ భాషల నుంచి తెలుగు భాషలోకి డబ్ అయిన సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. భారీ విజయాలను కట్టబెట్టారు. ఇలా తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయి మంచి హిట్ సాధించిన సినిమాలలో ఒకటి ఆవారా. ఈ సినిమాలో కార్తీ హీరోగా నటించాడు.

 

 కాగా హీరో కార్తి తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరోల్లో ఒకడు. సూర్య తమ్ముడిగా సినీ పరిశ్రమకు పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇక ఎన్నో సినిమాల్లో పలు వైవిధ్యమైన పాత్రలతో అటు తమిళ ప్రేక్షకులనే   కాదు ఇటు  తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని  ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు కార్తీ. అయితే ఆవారా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

 

 కార్తీ తమన్నా జంటగా తెరకెక్కింది  చిత్రం. ఈ సినిమా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకుంది. అటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా డబ్ అయింది ఈ సినిమా. తెలుగులో తమిళ్ కంటే భారీ విజయం సాధించింది సినిమా. ఈ సినిమా స్టోరీ సినిమాలో కామెడీ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఆవారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు కార్తీ. అయితే ఒకానొక సమయంలో తనకు తెలుగు ప్రేక్షకులు తమిళ ప్రేక్షకుల అంటే ఎంతగానో ఇష్టమని.. తను తమిళ్ హీరో అని తెలిసినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులు తెలుగు హీరోల కంటే ఎక్కువగానే తనను ఆదరిస్తారు అంటూ చెప్పుకొచ్చాడు కార్తీ .

మరింత సమాచారం తెలుసుకోండి: