చిరంజీవి ఈ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగి పోయి నటిస్తారు అనేది అందరికి తెలిసిన వాస్తవం. ఆయనకు చేసే పని పై ఉన్న శ్రద్ద అలాంటింది. అంతటి కటినమైన దీక్ష, శ్రద్ద ఉన్నందునే ఆయనని మెగా స్టార్ గా నిలబెట్టింది. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కున్నా వెండి తెర విజేతగా నిలబడ్డారు. అయితే ఆయన తన కెరీర్లో చాలా మంది కథానాయికలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో శ్రీదేవి, చిరంజీవి కలిసి వెండి తెర పై కనిపిస్తే అభిమానులకు పండగే.

 

చిరంజీవి, శ్రీదేవి కలిసి 80 లలో ఎన్ని సినిమాలు చేసినా అనుకున్నంత విజయాలను అందుకోలేక పోయాయి. అయితే కలెక్షన్ పరంగా హిట్ రాకపోయినా నటన పరంగా పలువురి ప్రశంసలు అందుకున్నారు. అయితే 1994 లో రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో అల్లు అరవింద్, జి. కే. రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఎస్ పి పరశురాం సినిమా మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించగా దేవరాజ్, హరీష్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

 

సినిమా తమిళ బ్లాక్ బస్టర్ సినిమా వాల్టర్ వెత్రివేల్ కు రీమేక్ గా చేశారు. ఇక కథ విషయానికి వస్తే చిరంజీవి నిజాయితీకి మారు పేరుగా ఉండే పోలిస్ ఆఫీసర్ పరశురాం పాత్రలో నటించగా, శ్రీదేవి ఒక దొంగ గా నటిస్తుంది. చిరంజీవి ఉద్యోగ నిమిత్తంగా శ్రీదేవి ని పట్టుకునే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఆమె తన కళ్ళు పోగొట్టు కొంటుంది. అయితే పరశురాం ఆమెను ఎలా కాపాడతాడు అనే విధంగా కథ ఉంటుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్  లో వచ్చిన ఈ సినిమా కథ ప్రేక్షకులకు దగ్గరైనా కలెక్షన్ పరంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: