సుర్వీన్ చావ్లా 2009వ సంవత్సరం లో విడుదలైన రాజు మహారాజు సినిమాలో శర్వానంద్ సరసన నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు, రమ్య కృష్ణ ప్రధానపాత్రల్లో నటించారు. రాజు మహారాజు సినిమాలో ఆమె బాగానే అందాలు ఆరబోసింది కానీ ఆమెకు మాత్రం గుర్తింపు లభించలేదు. సినిమా కూడా ఫెయిల్ అవ్వడం తో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు మళ్ళీ తిరిగిచూడలేదు. 


మొట్టమొదటిగా సుర్వీన్ చావ్లా హమ్ తుమ్ షబానా సినిమాలో శృంగభరితమైన పాత్రలో నటించి బోల్డ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సుర్వీన్. ఆ సమయంలోనే కన్నడ తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2011వ సంవత్సరంలో ధర్తీ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన సుర్వీన్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వరుసగా 5-6 సినిమాల్లో, సిరీస్ లలో నటించిన ఈమె 2014వ సంవత్సరం లో విడుదలైన హేట్ స్టోరీ 2 లో బీభత్సముగా అందాలు ఆరబోసి హింది ప్రేక్షకులకు కనులవిందు చేసింది. 


2015 వ సంవత్సరం లో ముంబైకి చెందిన అజయ్ అనే ఒక బడా వ్యాపారవేత్తని పెళ్లాడింది. సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరమవుతారు. కానీ ఈ అమ్మడు మాత్రం పెళ్ళైన తరువాత కూడా సినిమాలకు దూరమవ్వలేదు కదా... గ్లామర్ షో ఇంకాస్త పెంచేసింది. అదేంటండి మీరు మ్యారేజ్ అయిన తరువాత కూడా బోల్డ్ రోల్స్ లలో నటిస్తున్నారు అని ఆమెను ఓ ఇంటర్వ్యూ లో ప్రశ్నించగా... నేను నగ్నంగా నటించినా నా భర్త నన్ను ఏమి అనడు. మీ ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. నన్ను అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం. ఒక నటిగా నేను ఏ క్యారెక్టర్ లో నటించినా అర్థం చేసుకునే గొప్ప మనసు తనకు ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: