జగన్ అడగకుండానే వరమిచ్చారు. మీ ఇష్టమని అన్నారు. మీరు ఎలా చేసుకుంటే అలా చేసుకోండి అంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఆయన కోరిందల్లా ఏపీకి వచ్చి తమ కార్యకలాపాలు సాగించమనడమే. నిజానికి ఒక ప్రభుత్వం తన పరంగా ఇలా ముందుకు వచ్చి ఇంత ఉదారం చూపిన సందర్భాలు బహు తక్కువ.

 

కానీ టాలీవుడ్ కి మాత్రం కేసీయార్ ముద్దు అయ్యాడని అంటున్నారు. ఏపీలో జగన్ సర్కార్ మీ ఇష్టం వచ్చిన చోట షూటింగులు చేసుకోండి, అది ఉచితంగా అని అంటున్నా కూడా టాలీవుడ్ నుంచి కనీసం వెల్ కం అంటూ ఒక ప్రకటన కూడా రాకపోవడం విడ్డూరమే. అదే సమయంలో సినీ రంగం పెద్దలు తెలంగాణా మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమై  సినిమా షూటింగులకు అనుమతులు ఇవ్వాలని వేడుకోవడం విశేషం.

 

అంటే ఓ వైపు బంగారం లాంటి ఆఫర్ ఏపీ సర్కార్ ఇచ్చినా కూడా తెలంగాణాకు విన్నపాలు పంపుకోవడం అంటే సినీ పెద్దల ఓటు ఎటో అర్ధమైపోతోందని  రాజకీయాల్లో చర్చ సాగుతోంది. మరో వైపు చూసుకుంటే కేసీయార్ తో కూడా సినీ పెద్దలు సమావేశం జరిపినా కూడా ఇండోర్ షూటింగులకు మాత్రమే షరతుల మీద అనుమతులు సాధించుకోగలిగారు, కానీ అవుట్ డోర్ షూటింగులకు ఇంకా లేదు.

 

ఇంత జరిగినా కూడా ఏపీ సర్కార్ చూపించిన ఉదారత మీద మాత్రం కనీసంగా టాలీవుడ్లో చర్చ సాగలేదన్న మాట వైసీపీ నుంచి వినిపిస్తోంది అంటున్నారు. అంటే ఎంతగా వరాలు ఇచ్చినా స్నేహ హస్తం చాచినా కూడా టాలీవుడ్ తెలంగాణా గడప దాటదని అర్ధమైపోతోందని అంటున్నారు. మరో వైపు సినీ రంగంలో ఉన్న రాజకీయాల వల్ల కూడా అనేక మంది నిర్మాతలు ఏపీలో షూటింగు చేయాలనుకుంటున్నా, ఏపే సర్కార్ వరాలు బాగున్నా నోరు విప్పలేకపోతున్నారని కూడా అంటున్నారు.

 

మరి కేసీయార్ సర్కార్ మీద భయమో, భక్తో కానీ ఏపీ అంటే మాత్రం సినీ దేవుళ్ళు ముఖం చూడడం లేదు అన్న చర్చ మాత్రం జరుగుతోంది. దీని పర్యవశానాలు ఎలా ఉంటాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: