అనుకున్నవి జరగనప్పుడు.. జరుగుతున్న వాటితోనే అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అప్పుడే కెరీర్ కూడా ముందుకెళ్తుంది. అలా కాకుండా తాము కోరుకున్న అవకాశాలు వస్తేనే కెమెరా ముందుకెళ్తాం అంటే కష్టం. అందుకే చిన్న పాత్రలకు కూడా ఓకే చెబుతున్నారు ఇద్దరు యంగ్ బ్యూటీస్. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఐటమ్ పాపలుగా మారుతున్నారు. 

 

హెభాపటేల్ కుమారి 21ఎఫ్ తో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. కానీ ఆ తర్వాత హెభాకు ఈ రేంజ్ హిట్స్ రాలేదు. మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24కిస్సెస్ లాంటి ఫ్లాపులొచ్చాయి. ఈ ప్లాపుల దెబ్బకు హెభా సపోర్టింగి రోల్స్ కు పడిపోయింది. నితిన్ భీష్మలో చిన్న రోల్ చేసిన హెభా, ఇప్పుడు రామ్ రెడ్ లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. డింఛక్ అంటూ రామ్ తో కలిసి స్టెప్పులేసింది కుమారి. 

 

దర్శకుడు సినిమాతో మెప్పించి పూజిత పొన్నాడకి ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. రంగస్థలంలో సపోర్టింగ్ రోల్ చేసినా కెరీర్ లో పెద్దగా మార్పురాలేదు. దీంతో పూజిత స్పెషల్ సాంగ్ కు షిప్ట్ అవుతోందట. పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాలో స్పెషస్ సాంగ్ చేస్తోందట పూజిత. మొత్తానికి హీరోయిన్ గా వెండితెరపై మెరుపులు మెరిపిద్దామని వచ్చిన ఈ ఇద్దరు సపోర్టింగ్ క్యారెక్టర్ స్థాయికి చేరారు. మళ్లీ మెరవాలని తెగ ట్రై చేస్తున్నారు. అవకాశాల కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నారు. హీరోయిన్ అవుదామని వచ్చి ఐటం పాపల్లా మారిపోయారు.

 

సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇక తమదే అంతా అనుకున్నారు. కానీ రానురాను పరిస్థితులు మారిపోయాయి. అనుకొన్నదొకటి అయిందొకటి కావడంతో కెరీర్ డిస్ట్రబ్ అయింది. ఇపుడు మళ్లీ మొదటి స్థానానికి వచ్చేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: