కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ దెబ్బకి టాలీవుడ్ ఇండస్ట్రీ కొన్ని కోట్లు నష్టపోయింది. ప్రతి వేసవి కాలం సీజన్ లో భారీ స్థాయిలో సినిమాలు రిలీజ్ చేసి ఎంతో వ్యాపారం చేసే టాలీవుడ్ ఈసారి ఏ సినిమాలు కరోనా వాళ్ళ రిలీజ్ చేయక లేకపోయింది. ఎవరూ ఊహించని విధంగా కరోనా వైరస్ రావటంతో వేసవి సీజన్ ని టార్గెట్ చేసుకుని విడుదల కావాల్సిన సినిమాలు అంత వాయిదా పడ్డాయి. గుంపులు గుంపులుగా ఉండేచోట వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో సినిమా థియేటర్లు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఇటీవల నాలుగో దశ లాక్ డౌన్ పొడిగించిన సమయంలో చాలావరకు ఆంక్షలు ఎత్తివేస్తూ చాలా వాటికి సడలింపులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది.

 

ట్రైన్స్ తిప్పు కోవచ్చని ఆదేశాలు ఇచ్చిన కేంద్రం దేశీయ విమానాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎఫెక్ట్ కి ఆగిపోయిన సినిమా షూటింగులు , రిలీజ్ కావాల్సిన సినిమాల విషయంలో ఇటీవల సినిమా ఇండస్ట్రీ పెద్దలు మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అవ్వడం జరిగింది. షూటింగ్ కి రావలసిన పర్మిషన్ విషయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చాలా సేపు మంతనాలు జరిపారు. 

 

అయితే మరి కొద్ది రోజుల్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా ఇండస్ట్రీ పెద్దలు భేటీ అవుతున్నట్లు త్వరలోనే సినిమా షూటింగులు జరిగే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇండస్ట్రీ మొత్తం షూటింగులకు కదలటానికి రెడీగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: