కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 15 ఏళ్ళ క్రితం కోలీవుడ్ తో పాటు ఇటు టాలీవుడ్ లో కూడా ఏక కాలంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన సినిమా చంద్రముఖి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు పి వాసు దర్శకత్వం వహించారు. వాస్తవానికి అంతకముందు కొన్నేళ్ల క్రితం శోభన ప్రధాన పాత్రలో మలయాళంలో 1993లో మొదటగా ఈ చంద్రముఖి సినిమా రావడం జరిగింది. ఆ తరువాత అదే సినిమాని తమిళ్ లో రజినీకాంత్ తో పాటు, ఆపై కన్నడలో సౌందర్య విష్ణువర్ధన్ ల కాంబోలో కన్నడలో రీమేక్ చేసి తీయడం జరిగింది. అయితే అటు మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో కూడా ఎంతో గొప్ప విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు, ఆ తరువాత తెలుగులో దానికి కొనసాగింపుగా నాగవల్లి పేరుతో విక్టరీ వెంకటేష్ తో పి వాసు ఒక సినిమా తీయడం జరిగింది. 

 

అయితే నాగవల్లి మాత్రం ఆశించిన రేంజ్ లో అంచనాలు అందుకోలేక పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఇక మళ్ళి ఇన్నేళ్ల తరువాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా రానున్న చంద్రముఖి 2 లో తాను నటించబోతున్నట్లు ఇటీవల నటుడు, డాన్సర్ అయిన రాఘవ లారెన్స్ ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాకు కూడా పి వాసు నే దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా రజినికాంత్ నటిస్తున్నారని, అలానే జ్యోతిక కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే నేడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోగా లారెన్స్ నటిస్తున్నాడని, అయితే ఈ సినిమా గతంలో వచ్చిన చంద్రముఖికి సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ కాదని, ఇక రజినికాంత్ కానీ, జ్యోతిక కాని ఇందులో నటించబోవడం లేదని తెలుస్తోంది. 

 

చంద్రముఖిని రాజు చంపకముందు ఆమె ప్రియుడితో ఆమె సాగించిన ప్రేమ, అలానే ఆ తరువాత రాజు వారిద్దరిపై కక్షగట్టడం, అనంతరం వారిద్దరిని అంతం చేయడం అనే కథాంశం నేపథ్యంలో సాగనుందట. అయితే ఎంతో భారీ ఖర్చుతో తెరకెక్కనున్న ఈ సినిమాని లారెన్స్ తో చేస్తున్నారు కదా, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటూ కొందరు సినీ ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. కాగా కథ, కథనాల్లో మంచి బలం ఉన్నందున నిర్మాతలు కూడా ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడడం లేదని, తప్పకుండా చంద్రముఖి మాదిరిగా ఈ సినిమా కూడా మంచి హిట్ కొడుతుందని యూనిట్ ఎంతో ధీమాతో ఉందట. మరి ఈ సినిమా విషయమై ఏమి జరుగుతుందో, రిలీజ్ తరువాత ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: