టాలీవుడ్లో చిరంజీవి, బాలక్రిష్ణ ఇద్దరూ ఇద్దరే. ఈ ఇద్దరి సినిమాలు వస్తాయంటే అభిమానులకు పూనకేమే వస్తుంది. ఇద్దరూ మాస్ హీరోలే. ఇద్దరికి భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇద్దరూ పోటాపోటీగా అన్ని రసాలు పండిస్తారు. ఈ ఇద్దరి మధ్య పోటీ మూడున్నర దశాబ్దాల క్రితం మొదలైంది. దాదాపుగా ఇరవై సినిమాల వరకూ ఇద్దరూ ధియేటర్లలో పోటీ పడ్డారు.

 

ఈ ఇద్దరి మధ్యన రసవత్తరమైన పోటీ జరిగి సరిగ్గా మూడేళ్ళు కావస్తోంది. 2017 సంక్రాంతికి బాలయ్య సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి రిలీజ్ అయింది. అదే టైంలో చిరంజీవి సినిమా ఖైదీ నంబర్ 151 కూడా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు మంచి హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టాయి.

 

ఇక ఈ సినిమాల తరువత ఇద్దరూ ఎన్నో సినిమాలు చేసినా కూడా పోటీ మాత్రం పడలేదు. ఆ భారీ  పోటీకి  మళ్ళీ సరిగ్గా సంక్రాంతికి ముహూర్తం చూసుకుని మరీ వస్తున్నారు. 2021 సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు కూడా. చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున ఆచార్య మూవీ సంక్రాంతికి పక్కా రిలీజ్ అంటున్నారు.

 

మొదట ఈ సినిమాను దసరా అనుకున్నారు కానీ కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధిచడంతో షూటింగ్ ఆగిపోయింది. పైగా 2021 సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ మూవీ వస్తుందని తగ్గాల్సివచ్చింది. అయితే ఇపుడు సమ్మర్ కి ఆర్.ఆర్.ఆర్ మూవీ వెళ్ళిపోయింది. దాంతో సంక్రాంతికి స్లాట్ ఖాళీ అయిపోయింది. దాంతో ధీమాగా ఆచార్య సంక్రాంతికి వస్తున్నాడు అంటున్నారు.

 

ఇక బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీ మీద కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య ఏకంగా అఘోరా పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ మూవీ గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య క్యారక్టర్ని డిజైన్ చేశామని బోయపాటి చెబుతున్నారు.

 

మొత్తం మీద చూసుకుంటే బాలయ్య సినిమా కూడా దసరాకు రావాలి, కరోనా లాక్ డౌన్ సేమ్ ప్రాబ్లంతో ఆగిన షూటింగు ని కంప్లీట్ చేసుకుని బాలయ్య సెంటిమెంట్ అయిన సంక్రాంతికి తీసుకురావాలనుకుంటున్నారుట. మొత్తం మీద చూసుకుంటే మరో మారు బాలయ్య, చిరు మధ్య గట్టి పోటీ కి రంగం సిధ్ధం అయిందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: