డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా RRR. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారి నందమూరి మరియు మెగా కుటుంబానికి చెందిన హీరోలు కలసి నటిస్తున్న తరుణంలో ప్రతి సీన్ విషయంలో రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు 80% అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కరోనా వైరస్ రావటంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ రెండు నెలలకు పైగా వాయిదా పడింది. అన్ని సినిమా షూటింగ్ లు ఆగిపోవటంతో 'RRR' సినిమా షూటింగ్ కూడా రాజమౌళి ఆపేశారు.

 

దీంతో ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఆలస్యం అవటంతో నెక్స్ట్ రిలీజ్ డేట్ జనవరి 8 అని రెండోసారి ప్రకటించిన తేదీకి కూడా ఈసారి వచ్చే అవకాశం లేదని వార్తలు సోషల్ మీడియాలో భయంకరంగా వినబడుతున్నాయి. ఇదే సమయంలో స్క్రిప్ట్ విషయంలో జక్కన్న లాక్ డౌన్  సమయములో కొన్ని మార్పులు చేసినట్లు దాంతో సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వార్తలు కుప్పలుతెప్పలుగా వార్తలు వస్తున్నాయి. దీంతో వస్తున్న వార్తలను రాజమౌళి ఖండించారు అంట. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది జనవరి 8న సినిమా రిలీజ్ అవుతుందని, ఇది కన్ఫామ్ అని సన్నిహితులతో అన్నట్లు సినిమా ఆలస్యం అవుతుంది అన్న వార్తలు ఫేక్ వార్తలు అని క్లారిటీ ఇచ్చారట.

 

 సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గేది లేదని రాజమౌళి తేల్చి చెప్పారట. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సినిమా షూటింగులకు ఓకే చెప్పటంతో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా జూన్ నెల నుండి సినిమా షూటింగ్ లో చేసుకోవచ్చని ఇండస్ట్రీ పెద్దలతో అన్నట్లు సమాచారం. మరి అనుకున్న టయానికి రాజమౌళి సినిమా విడుదల చేస్తారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: