రూలర్ తర్వాత బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ సినిమాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆరెక్స్ 100 భామ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొంత భామ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలో మొన్నటిదాకా అంజలి హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ను ఫైనల్ చేసినట్టు టాక్. 


ఆరెక్స్ 100 తో యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న పాయల్ ఆ తర్వాత క్రేజీ ఛాన్సులు అందుకుంది. రవితేజతో డిస్కో రాజా, వెంకటేష్ సరసన వెంకీమామ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఇప్పటికే రెండు మూడు సినిమాలకు సైన్ చేసింది. ఇప్పుడు బాలయ్య బాబు సరసన కూడా ఛాన్స్ పట్టేసిందని అంటున్నారు. ఆరెక్స్ 100 సినిమాలో హాట్ అందాలతో అలరించిన పాయల్ ఇక మీదట పాత్ర ప్రాధాన్యత ఉండే సినిమాలే చేస్తా అని అంటుంది. వెంకీమామ సినిమాలో కూడా ఆమెను మోసం చేసినట్టు చెప్పుకొచ్చింది. 


లేటెస్ట్ గా బాలయ్య ఆఫర్ ను ముందు కాదని చెప్పినా రెమ్యునరేషన్ భారీగా ఆఫర్ చేయడంతో ఆమె ఓకే చెప్పిందట. బాలకృష్ణతో పాయల్ రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. కేవలం అందాల ప్రదర్శన మాత్రమే కాకుండా పాయల్ తెలుగులో అభినయ తారగా కూడా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. ఆరెక్స్ 100 సీక్వల్ లో కూడా మరోసారి కార్తికేయతో రొమాన్స్ కు రెడీ అవుతుంది ఈ చిన్నది. మొత్తానికి చేతినిండా సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది ఈ పంజాబీ భామ.                 

 

మరింత సమాచారం తెలుసుకోండి: