ఇప్పటికే కరోనా మహమ్మారి దెబ్బకు మన దేశంతో పాటు పలు ఇతర దేశాలు కూడా పూర్తిగా ఆర్ధికంగా ఎన్నో సమస్యల్లో ఇరుక్కుపోయాయి. మన దేశంలో కూడా దాదాపుగా రెండు నెలలకు పైగా లాక్ డౌన్ అమలవుతుండడంతో ఎందరో ప్రజలు నానా అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆర్ధిక మాంద్యం పరిస్థితి అయితే మరింత ఇబ్బందుల్లో పడింది, తద్వారా ఎందరో ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. ఇక ఈ మహమ్మారి దెబ్బకు సినిమా పరిశ్రమ కూడా ఎంతో భారీ నష్టాన్నే చవిచూడవలసి వచ్చింది. మన టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు షూటింగ్స్ ఆగిపోయి బోలెడు నష్టాలు చవిచూడవలసి వస్తోంది. 

 

అయితే ప్రస్తుతం మెల్లమెల్లగా ఒక్కో రంగానికి పరిస్థితిని బట్టి కొంత సడలింపులు ఇస్తూ పోతున్నాయి ప్రభుత్వాలు. కాగా నేడు సినిమా పరిశ్రమ పరిస్థితి, షూటింగ్స్ కొనసాగింపు, అలానే థియేటర్స్ ఎప్పటినుండి తెరవాలి అనే దానిపై మెగాస్టార్ చిరంజీవి సహా మరికొందరు సినిమా పెద్దలు కలిసి వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కలిసి మాట్లాడడం జరిగింది. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ, జూన్ నుడి సినిమా షూటింగ్స్ మొదలెట్టుకోవచ్చని సీఎం గారు సూచించడం జరిగిందని, అయితే వాటికి కొన్ని నియమనిబంధనలు, విధానాలు అమలు చేయాలని సీఎం చెప్పారని, అతి త్వరలో వాటి తాలూకు పూర్తి వివరాలు తెలుస్తామని అన్నారు. 

 

అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, హై బడ్జెట్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ నుండి చిన్న సినిమా వరకు కూడా ఈ రెండు నెలల పాటు నిర్మాతలు తెచ్చిన ఫైనాన్స్ పై వడ్డీలు కట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని కొందరు సినిమావారు బహిరంగము గానే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఈ పరిస్థితులు మరికొన్నాళ్లు కనుక నిరంతరాయంగా కొనసాగితే మాత్రం తమ సినిమాలపై పెట్టిన పెట్టుబడి వృధా అవుతుందని, తద్వారా తైలం దండగ అవడం తప్ప ఏ మాత్రం ప్రయోజనం ఉండదని వాపోతున్నారు నిర్మాతలు. మరి ఖచ్చితంగా ఎప్పటి నుండి సినిమా షూటింగ్స్ మొదలవుతాయో తెలియాలి అంటే ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను బట్టి చెప్పగలం అని అంటున్నారు సినీ విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: