మన తెలుగులో హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరో పవన్ కళ్యాణ్. ఆయన సినిమాలు అనగానే మన తెలుగులో ప్రేక్షకులకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. సినిమా వస్తుంది అంటే చాలు పనులు మానుకుని కూడా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. 2018లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టించిన సినిమా అజ్ఞాత‌వాసి. ఇది అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. ప‌వ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ముందు భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌లోకి వెళ్లిపోయారు. గత రెండేళ్ళు గా పవన్ నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పుడు ఆయన ఒక సినిమా చేస్తున్నారు. 

 

వకీల్ సాబ్ అనే టైటిల్ తో పవన్ సినిమా వస్తుంది. ఆ సినిమాలో ఆయన లాయర్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ తో ఒక సినిమా చేస్తున్నారు పవన్. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో ఒక సినిమాను ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా విషయంలో పవన్ లో అనేక భయాలు ఉన్నాయని అంటున్నారు. హరీష్ శంకర్ ముందు డబ్బింగ్ అని చెప్పారు... ఆ తర్వాత తానే కథను రెడీ చేసినట్టు చెప్పారు. 

 

ఇప్పుడు హరీష్ సొంత కథ అయి సినిమా ఫ్లాప్ అయితే దెబ్బ అని... తనతో గతంలో నష్టపోయిన నిర్మాతతో సినిమా చెయ్యాలి అనుకుంటున్నా అని.... దానికి తోడు తనకు గతంలో హరీష్ రీమేక్ సినిమాతోనే హిట్ ఇచ్చాడు కాబట్టి రీమేక్ చేస్తే బెటర్ అని చెప్పినట్టు సమాచారం. పవన్ ఆలోచన తెలిసిన హరీష్ ఇప్పటికే ఒక సినిమా కు సంబంధించిన హక్కులను కొనాలని పవన్ కి చెప్పినట్టు టాక్. ఆ సినిమా ఓకే కాకపోతే వేరే సినిమాను లైన్ లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: