లాక్ డౌన్ తో షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ అనుకున్న విడుదల తేది జనవరి 8న రాకపోవచ్చు అన్న సంకేతాలు ఈమూవీ నిర్మాత ఇవ్వడంతో ఇక మూవీ విడుదల వాయిదా ఖాయం అన్న నిర్ణయానికి అందరు వచ్చారు. అయితే మొన్న చిరంజీవి ఇంటిలో సినిమా షూటింగ్ లకు సంబంధించి జరిగిన ఇండస్ట్రీ ప్రముఖుల ప్రముఖుల సమావేశానికి రాజమౌళి కూడ హాజరు అయిన తరువాత అతడి ఆలోచనలలో అనూహ్యమైన మార్పులు వచ్చినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.


సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకోవడానికి అనుమతులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీ పెద్దలు కోరిన విధంగా జూన్ 1 నుండి షూటింగ్ లకు అంగీకరిస్తే ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని అవసరం అనుకుంటే రాబోయే నెలలలో పగలు రాత్రి పనిచేసి ‘ఆర్ ఆర్ ఆర్’ ముందుగా అనుకున్న వచ్చే ఏడాది జనవరి 8 డేట్ మిస్ కాకుండా చూడాలని రాజమౌళి కొత్త ఆలోచన అని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ మూవీ విడుదలయ్యే అన్ని భాషలకు అనువైన డేట్ ను ఫిక్స్ చేయడం కష్టం కాబట్టి ఏదోవిధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ ను జనవరి 8 డేట్ ను వదులుకోకుండా చేయగలిగిన ఒక కొత్త ప్లాన్ ఇప్పుడు రాజమౌళి మనసులో ఉంది అని అంటున్నారు.


దీనికోసం అవసరం అయితే ఈ మూవీ స్క్రిప్ట్ లో మార్పులు చేసి లొకేషన్స్ కుదించి గ్రాఫిక్స్ పనులకు సంబంధించిన వ్యవహారాలను మరీ ఎక్కువగా చేయకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ నడిపించే ఒక కొత్త యాక్షన్ ప్లాన్ ప్రస్తుతం రాజమౌళి ఆలోచనలలో ఉంది ని అంటున్నారు. అయితే కరోనా దెబ్బకు భయపడి ఈ మూవీలో నటిస్తున్న విదేశీ నటీనటులు ఎంతవరకు వెంటనే రాజమౌళి పిలుపు సపందిస్తారు అన్న సందేహాలు కూడా ఉన్నాయి.


అయితే రాజమౌళి మనసు గ్రహించిన చరణ్ జూనియర్ లు మాత్రం అందరు సమిష్టిగా కష్టపడితే జక్కన్న యాక్షన్ ప్లాన్ ను అమలుజరపడం పెద్ద కష్టం కాదు అంటూ వారు రాజమౌళి ఆలోచనలకు తమ సంఘీభావం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళికి వచ్చిన ఈ కొత్త ఉత్సాహం ఎంతవరకు కార్యరూపంలో నిలబడుతుంది అని తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: