కరోనా దెబ్బతో ప్రముఖ నిర్మాణ సంస్థలు భవిష్యత్ లో ఇక సినిమాలు తీయడం కష్టం అని భావిస్తూ ఉంటే మీడియా చక్రవర్తిగా తెలుగు రాష్ట్రాలలో తనదైన ముద్రను కొనసాగిస్తున్న రామోజీరావు సొంత నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ తిరిగి చాల స్పీడ్ గా సినిమాలు తీసే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. 2011 వరకు ఉషాకిరణ్ మూవీ వరసగా ఎన్నో సినిమాలు నిర్మించింది.


ఒకప్పుడు అనేక హిట్స్ రావడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఉషాకిరణ్ మూవీస్ గత 10 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పెరిగిపోయిన భారీ నిర్మాణ వ్యయం భారీ పారితోషికాల నేపధ్యంలో సినిమాలు తీయడం మానేశారు. అయితే 2015లో ఈ నిర్మాణ సంస్థ సందీప్ కిషన్ హీరోగా ఒక మూవీ రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ లో మరొక మూవీ నిర్మించింది. అయితే ఆరెండు మూవీలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో ఉషాకిరణ్ మూవీస్ సినిమాల నిర్మాణానికి దూరంగా ఉంది.


అయితే ఇప్పుడు మళ్ళీ ఈ నిర్మాణ సంస్థ సినిమా నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులను కూడ ఎదిరించి మంచి కథలు దొరికితే లో బడ్జెట్ లో సినిమాలు తీసి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కరోనా సమస్యలు ప్రారంభం అయ్యాక రామోజీ గ్రూప్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది అన్న గాసిప్పులు వస్తున్నాయి. లాక్ డౌన్ వల్ల ఈటివి ఈనాడు పేపర్ కు ప్రకటనల విషయంలో ఆదాయం బాగా తగ్గింది అన్న లీకులు వస్తున్నాయి. దీనికితోడు కరోనా దెబ్బతో పర్యాటక రంగం కూడ పూర్తిగా దెబ్బ తినడంతో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పర్యాటకులతో నిండిపోయే రామోజీ ఫిలిం సిటి ఈ లాక్ డౌన్ వల్ల ఖాళీగా ఉండటం కూడ సమస్యలను మరింత పెంచుతోంది.


దీనితో రామోజీ ఫిలిం సిటీని రక్షించాలి అంటే అక్కడ ఖాళీగా ఉన్న అనేక ఫ్లోర్లు తిరిగి కళ వచ్చే విధంగా తామే సొంత సినిమాల నిర్మాణం చేపట్టీ కరోనా తరువాత ఏర్పడపోయే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని రామోజీ ఫిలింసిటీ నిర్వాహకులు భావిస్తున్నట్లు టాక్.  దీనికి సంబంధించి ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించిన టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ తో రామోజీ ఫిలిం సిటీ నిర్వాహకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: