ప్రస్తుతం తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ అసలు తెలుగు సినిమాకు గాడిలో పెట్టిన వ్యక్తి ఈ జనరేషన్‌లో చాలామందికి గుర్తులేడు. ఆయననే రఘుపతి వెంకయ్య నాయుడు. సినీ రంగంతో పరిచయం ఉన్నవారికి సుపరిచితమైన పేరు రఘుపతి వెంకయ్య నాయుడు. కదిలే బొమ్మను తెలుగు నేలకు తెచ్చిన మహానుభావుడు ఈయన. ఈయన 1869లో అక్టోబర్ 15న మచిలీపట్నంలో జన్మించారు రఘుపతి వెంకయ్య నాయుడు. బ్రిటీష్‌ పాలనలో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.

 

ఇండియన్‌ సినిమాలో నటుడిగా, సినీ నిర్మాతగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన మూకీ చిత్రాల నిర్మాణంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 1909లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన సినీ రంగంలో వివిధ శాఖల్లో పనిచేశారు. అదే సమయంలో ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి సినిమా మేకింగ్‌లో రకరకాల మెలకువలు తెలుసుకున్నాడు. 1912లో గెయిటీ థియేటర్ స్థాపించి సినిమాల ప్రదర్శన మొదలు పెట్టాడు. సౌత్‌తో ఫుల్‌ టైం ప్రదర్శనలు చేసిన థియేటర్ ఇదే కావటం విశేషం.

 

సినీ రంగంలో తొలి ప్రయత్నంగా చార్నో మెగా ఫోన్‌ను జాన్‌ డికిన్సన్‌ కంపెనీ నుంచి ఆర్డర్ చేశాడు రఘుపతి వెంకయ్య. అప్పట్లోనే 30వేల రూపాయలతో ఆ ఎక్విప్‌మెంట్‌ను కొన్నాడు ఆయన. దానితో దాదాపు 12 షార్ట్‌ ఫిలింస్‌ను చిత్రీకరించి విక్టోరియా పబ్లిక్‌ హాల్‌లో ప్రదర్శించాడు. తరువాత ఆ షార్ట్ ఫిలింస్‌ను బెంగళూరు, విజయవాడు, శ్రీలంక, రంగూన్‌, పెగు లాంటి ప్రాంతాల్లో ప్రదర్శించాడు. సొంతగా నిర్మాణ సంస్థతో పాటు స్టూడియోను స్థాపించిన రఘుపతి వెంకయ్య నాయుడు ఆయన కుమారుడిని లండన్‌లో సినిమాటోగ్రఫి చదివించాడు. వీరిద్దరూ కలిసి మీనాక్షి కళ్యాణం, గజేంద్ర మోక్షం, మత్య్సావతారం, నందనార్‌ లాంటి సినిమాలను రూపొందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: