గంభీరమైన రూపం.. హీరోలను సైతం గడగడలాడించే నైజం ఆమె సొంతం. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, రచయితగా తెలుగు సినిమాకు ఎనలేని సేవలందించిన మహానటి భానుమతి రామకృష్ణ. ఎన్నో అద్భుత పాత్రలకు ప్రాణం పోసిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి దొడ్డవరం అనే గ్రామంలో జన్మించింది. 1924 సెప్టెంబర్ 7న మద్దిపాడు మండలంలో జన్మించారు. బ్రిటీష్ పాలనా కాలంలో ఈ ప్రాంతం గుంటూరు జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉంది.

 

ఈమె సౌత్‌ సినిమాలో తొలి సూపర్‌ స్టార్‌గా పేరుతెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళ సినిమాలకు ఆమె విశేష సేవలందించారు. 1939లో 13 ఏళ్ల వయసులో కలింది అనే సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగులో వర విక్రయం ఆమె తొలి సినిమా. ఈ సినిమాకు సీ పుల్లయ్య దర్శకుడు. చక్రపాణి, లైలా మజ్ను, విప్రనారాయణ, మల్లెశ్వరి, బాటసారి లాంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించారు భానుమతి. 1953లో ఆమె దర్శకురాలిగా పరిచయం అయ్యారు. దర్శకురాలిగా తొలి సినిమానే మూడు భాషల్లో తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కించారు. దర్శకురాలిగా ఆమె తొలి చిత్రం చండీ రాణి.

 

ఆమె చివరి చిత్రం పెళ్లి కానుకగా ఈ సినిమా 1998లో రిలీజ్ అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో టాప్ స్టార్లు ఎన్టీ రామారావు, శివాజీ గణేషన్‌, ఎమ్జీ రామచంద్రన్, అక్కినేని నాగేశ్వరావు లాంటి వారితో కలిసి పని చేశారు భానుమతి. నటిగా ఎంతో పేరున్న ఆమె పొగరు బోతు అన్న పేరు కూడా ఉంది. ఆమె ఓవర్‌ కాన్ఫిడెన్స్ కారణంగానే మిస్సమ్మ, దేవదాసు లాంటి క్లాసిక్స్‌ నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చిందన్న వాదన ఉంది. అయితే ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది నటిగా ఆమెకు వంక పెట్టలేం. అందుకే అప్పటి ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ కూడా నేను భానుమతి అభిమానిని అని చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: