మొన్నీమద్య వరకూ చిన్న సినిమాలు మాత్రమే డిజిటల్ లో రిలీజ్ అనౌన్స్ చేస్తే. .  ఇప్పుడు అరణ్య, 83 లాంటి పెద్ద సినిమాల గురించి కూడా ఓటీటీల్లో చర్చ జరుగుతోంది. మల్టీప్లెక్స్ లు రిలీజుల్లేవ్, బిజినెస్ లేదని ఏడుస్తుంటే ... ఓటీటీలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి.  మరి పెద్ద సినిమాలుకూడా చిన్నస్క్రీన్ లోనే చూడాల్సిందేనా.. అన్న చర్చ మొదలైది ఇండస్ట్రీలో.

 

కరోనా వల్ల రిలీజ్ లు.. షూటింగ్ లు ఆగిపోవడంతో ఇండస్ట్రీ పెద్ద క్రైసిస్ ను  ఫేస్ చేయనుంది. చాలా సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. థియేటర్లు బంద్ అయిన అప్పటి నుంచి ఆడియన్స్ కు ఓటీటీ వరంలా మారింది . థియేటర్లు ఓపెన్ అయినా.. పెద్ద సినిమాల రిలీజ్ లతో క్లాష్ వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీ బాట పట్టాయి. ఇంకొన్ని సినిమాలు కూడా ఓటీటీ రిలీజ్ వైపు చూస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో సీరియస్ డిస్కర్షన్ గా మారింది.


చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీ బాట పట్టాయి. ఇక ఇంతకు ముందు మేము ఓటీటీలలో రిలీజ్ చేయం అనుకన్ను సినిమాలు కూడా ఇప్పుడు దారికి వస్తున్నాయి.  ఓ మోస్తరు బడ్జెట్ సినిమాల యూనిట్ల మధ్య డిస్కర్షన్ నడుస్తుంది. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని అనుకున్నా.. అవి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు.. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో.. నిర్మాతలు కూడా చాలా మంది ఓటీటీల వైపు చూస్తున్నారు.

 

కొత్త కొత్త ప్యాకేజిలతో.. కొత్త కాన్సెప్ట్ లతో బాగా ఎట్రాక్ట్స్ చేస్తున్నాయి డిజిటల్ యాప్స్. ఇక ఇంటిల్లిపాది కలిసి తక్కువ ఖర్చుతో ఎక్కువ సినిమాలు... ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే అవకాశం ఉండటంతో... జనాలు కూడా ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దాంతో కొత్త సినిమాలకు కూడా మంచి రేటుకు కోని వెబ్ రిలీజ్ చేయాలనేది ఓటీటీల ఆలోచన. దాంతో ఇప్పుడు రిలీజ్ కు ఉన్న చాలా సినిమాలకు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి డిజిటల్ ప్లాట్ ఫామ్స్.


 
ఆల్ రెడీ చిన్న బడ్జెట్ సినిమాలు కొన్ని ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక తమిళం నుంచి సూర్య నిర్మించిన  సినిమాతో పాటు... బాలీవుడ్ లో 83 మూవీతో పాటు అమితాబ్, ఆయుష్మాన్ గులాబో.. సితాబో కూడా వెబ్ రిలీజ్ కు రెడీ అయ్యాయి. మొన్న మొన్నటి వరకు మాకు అలాంటి ఉధ్ధేశ్యం లేదు అన్న ఉప్పెన, అరణ్య లాంటి సినిమాలు కూడా ఇప్పుడు వెబ్ రిలీజ్ వైపు చూస్తున్నాయి. అనుష్క నిశ్శబ్ధం కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. అందుకే పెద్ద సినిమాలు కూడ చిన్నస్క్రీన్ లోనే చూడాల్సొస్తుందే మో అని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: