డిజిటల్ రైట్స్ విషయంలో బాహుబలి రికార్డ్ నే బ్రేక్ చేసేసింది కేజీఎఫ్-2. డిజిటల్  రైట్స్ లో టాప్ 5 సినిమాలను రిలీజ్ కాకుండానే దాటేసింది కన్నడ సినిమా. కేజీయఫ్ చాప్టర్ 2 సినిమా  డిజిటల్ రైట్స్ విషయంలో దుమ్మురేపుతోంది. ఇప్పటికే దాదాపు 55 కోట్లకు కేజీఎఫ్ చాప్టర్2  మూవీ డిజిటల్ రైట్స్ అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో... సైలెంట్ గా వచ్చి.. ప్యాన్ ఇండియా లెవల్లో  సూపర్ హిట్ అయ్యింది కేజీయఫ్ సినిమా. కేజీయఫ్ ఫస్ట్ మూవీ 18 కోట్ల డిజిటల్ రైట్స్ ను మాత్రమే సాధిస్తే. సెకండ్ మూవీ రిలీజ్ కాకుండానే ఏకంగా 55కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది.

 

ప్రజెంట్ తెలుగు సినమా స్తాయి మినిమమ్ 100 కోట్లు  ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన బాహుబలి2 డిజిటల్ రైట్స్ విషయంలో కూడా 52 కోట్లతో టాప్ లో ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ ను కేజీయఫ్ బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది కెజిఎఫ్. 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్ పెట్టినా.. పర్వాలేదు అన్నట్టు నడిచింది సాహో సినిమా. సుజిత్ డైరెక్షన్ లో ప్రభాస్-శ్రద్థా కపూర్ నటించిన సాహొ దాదాపు 40 కోట్ల డిజిటల్ రైట్స్ ద్వారా రాబట్టింది.  టాలీవుడ్ లో అంతగా హిట్ అవ్వకపోయినా.. శాటిలైట్, డబ్బింగ్ అన్ని రైట్స్ మాత్రం సత్తా చాటింది. అన్నీ కలుపుకుని 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సాహోకు ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ లైఫ్ స్టోరీతో... సురేందర్ రెడ్డి డైరెక్షన్లో  తెరకెక్కిన ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో మంచి కలెక్షన్స్ ను సాధించింది.

 

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీగా... 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కినన సైరా నరసింహా రెడ్డిమూవీ డిజిటల్ రైట్స్ కూడా దాదాపు 25 నుంచి 30  కోట్ల వరకు అమ్ముడు పోయాయి. ఇక 400 కోట్లకు పైగా బడ్జెట్ తో.. సూపర్ స్టార్ రజనీకాంత్-అక్షయ్ కుమార్-శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో2.Oమూవీ..కలెక్షన్స్ పరంగా పెద్దగా  రాబట్టలేకపోయింది.  ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా చేసిన ఈ రోబో 2 మూవీ.. డిజిటల్ రైట్స్ దాదాపు 30 కోట్లకు పైగా అమ్ముడు పోయాయి.  ఇప్పటి వరకూ బాహుబలి డిజిటల్ రైట్స్ ని దాటేసిన యష్..ముందు ముందు  ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: