ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు వ్యక్తిగతంగా కలిసి షూటింగ్ లకు అదేవిధంగా ధియేటర్ల ఓపెనింగ్ కు సంబంధించి అనుమతులు ఇవ్వవలసిందిగా కోరిన విషయం తెలిసిందే. వచ్చేనెల నుండి దశల వారిగా షూటింగ్ ల పునరుద్ధరణకు అనుమతులు ఇచ్చి చివరిగా ధియేటర్ల ఓపెనింగ్ జరుగుతాయి అన్న స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. 


జరుగుతున్న పరిణామాల పై ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ మార్కెట్ లోకి రాకుండా ధియేటర్లను ఓపెన్ చేస్తే జనం వైన్ షాపులకు వచ్చినట్లు థియేటర్లకు రారు అని అభిప్రాయపడ్డారు. ధియేటర్లు తెరిస్తే జనం తామంతట తామే ధియేటర్లలోకి వస్తారు అని అనుకోవడం అవివేకం అంటూ కామెంట్స్ చేసారు. దీనితో ఖంగారు పడి ధియేటర్లను తెరవకుండా సరైన టైమ్ కి మాత్రమే థియేటర్లు తెరవాలని సురేష్ బాబు అభిప్రాయం.


భారతదేశంలో 10 వేల థియేటర్లు మన రాష్ట్రాల్లో 2 వేల థియేటర్లు చిక్కుల్లో ఉన్నాయని ఈ సమస్య వలస కార్మీకుల సమస్య లానే పరిష్కారం లేని సమస్య అంటూ తన ఆవేదన వ్యక్త పరిచాడు. నిర్మాతలు అంతా తమ సినిమాలను ఓటీటీ లలో రిలీజ్ చేయడం మొదలుపెట్టిన పరిస్థితులలో థియేటర్ ఓనర్లు సిబ్బంది పరిస్థితి మరింత అయోమయం అంటూ కామెంట్ చేసాడు.  


అంతేకాదు ఇలాంటి పరిస్థితి ఏడాది పాటు కొనసాగుతుందని అందువల్ల ధియేటర్లకు ప్రభుత్వాల తరపు నుంచి సపోర్ట్ లేకపోతే ఒటీటీ లు పెరుగుతాయేమో కాని దియేటర్లు బతకవు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ప్రభుత్వాలు చెప్పిన విధంగా సామాజిక దూరం పాటిస్తూ ధియేటర్లలో సీటింగ్ మారిస్తే ధియేటర్ల రెవిన్యూ తగ్గటమే కాకుండా జనం తక్కువ మంది ఉంటే ఆనందం వినోదం ఏమి ఉంటుంది అన్న అభిప్రాయంతో ధియేటర్లకు రాకపోవచ్చు అని అంటున్నారు. దీనితో సినిమా షూటింగ్ లు మొదలైనా అంతిమంగా ధియేటర్లకు వచ్చి జనం సినిమాలు చూసే పరిస్థితులు లేకుండా ఉంటే ఈ షూటింగ్ లు వల్ల ఎవరికి ప్రయోజనం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: