తెలుగులో స్టార్ డైరెక్టర్లకి థీటుగా, ఎన్టీఆర్ స్టేచర్ కి మ్యాచ్ అయ్యేలా మాంచి స్టోరీ రెడీ చేసిన ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. మొత్తానికి ఎన్టీఆర్‌తో సినిమా ఓకే చేయించుకున్నాడు కన్నడ డైరెక్టర్.  కెజిఎఫ్  తో కన్నడలో సినిమాలు చేస్తున్న ప్రశాంత్ తెలుగులో ఎన్టీఆర్ తో   సినిమా చెయ్యడానికి   ఎప్పటి నుంచో ప్లాన్స్  వేస్తున్నాడు.

 

పట్టువదలని విక్రమార్కుడిలా ఎన్టీఆర్ తో సినిమాకోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూనేఉన్నాడు ప్రశాంత్ .  కెజిఎఫ్ 2 టైమ్ లో ఎన్టీఆర్ ని ఫిల్మ్ సిటీలో కలిసినప్పుడు చెప్పిన లైన్ కి ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ ఫ్యూచర్ లో సినిమా చేద్దామని చెప్పాడు. అంతే కాదు సినిమాకు సంబందించి మైత్రి మూవీస్ వాళ్లు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని టాక్ నడుస్తోంది.

 

ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ ఆఱ్ తో బిజీగా ఉన్నాడు.  దీనికోసం ఫిజికల్ గా కూడా మేకోవర్ అయ్యి సిక్స్ ప్యాక్ చేశాడు. ప్రశాంత్ కూడా కెజిఎఫ్ 2  మూవీతో ఎంగేజ్ అయిపోయాడు . ఇప్పుడు కెజిఎఫ్ ఫైనల్ స్టేజ్ కి రావడంతో ఎన్టీఆర్ తో సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు ప్రశాంత్.

 

సో.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా కంప్లీట్ అయ్యాక  ప్రశాంత్ తో  ఫుల్ ఫ్లెడ్జ్  కమర్‌షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే యష్ తో కమర్‌సియల్ ఎంటర్ టైనర్ తీసి అదిరిపోయే సక్సెస్ కొట్టిన ప్రశాంత్ .. యంగ్ టైగర్ కోసి మరో  విజువల్ ఫీస్ట్ ని రెడీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ... లేటెస్ట్ గా ప్రశాంత్  సోషల్ మీడియాలో ఎన్టీఆర్ తో కలుస్తా అన్న మెసేజ్ కూడా ఈ న్యూస్ కి బలమిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: