అల్లు అర్జున్‌ సుకుమార్ ల కాంబినేషన్ లో ఇంకా షూటింగ్ కూడ ప్రారంభంకాని ‘పుష్ప’ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ పుట్టినరోజునాడు విడుదలైన ఈమూవీ ఫస్ట్ లుక్ తో అంచనాలు మరింతపెరిగాయి. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటూ బన్నీ అభిమానులు ఇప్పటి నుండే ఊహలలో ఉన్నారు. 


గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో పూర్తిగా అటవీ ప్రాంతంలో తీయవలసిన ఈమూవీ షూటింగ్ కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడింది. వచ్చేనెల నుండి ప్రభుత్వాల నుండి షూటింగ్ లకు అనుమతులు వచ్చినా పూర్తిగా అవుట్ డోర్ లో నిర్వహించే సినిమాల షూటింగ్ లకు అనుమతులు రావడానికి కనీసం మరో మూడు నాలుగు నెలలు పట్టినా ఆశ్చర్యంలేదు అని అంటున్నారు. దీనితో బన్నీ ఈసినిమాలోని తన లుక్ కోసం పెంచుకున్న గుబురు గెడ్డం జుత్తుతో కరోనా తో పాటు సహజీవనం చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 


ఇలాంటి పరిస్థితులలో ఈ లాక్ డౌన్ సమయంలో దర్శకుడు మారుతి చెప్పిన ఒక కథ లైన్ కు బన్నీ ఓకె చెప్పడమే కాకుండా ఆకథను పూర్తి స్క్క్రిప్ట్ గా మార్చమని తాను ఆ కథలో నటిస్తాను అని మారుతికి బన్నీ చెప్పినట్లుగా వస్తున్న వార్తలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వాస్తవానికి ‘పుష్ప’ పూర్తి చేయడానికి బన్నీకి కనీసం 6 నుంచి 8 నెలల కాలం పట్టే అవకాశం ఉంది. 


ఆతరువాత బన్నీ వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ మూవీలో నటించడానికి మాట ఇచ్చాడు. దీనితో ఈరెండు సినిమాలు పూర్తి కావడానికి కనీసం ఒకసంవత్సరం సమయం పట్టే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు బన్నీ మారుతి చెప్పిన కథకు ఎందుకు ఓకె చేసాడు అన్నసందేహాలు కలుగుతున్నాయి. మరికొందరైతే ‘పుష్ప’ సినిమాకు అనుమతులు రావడానికి ఇంకా చాలసమయం పట్టే పరిస్థితి ఏర్పడితే ‘పుష్ప’ ను పక్కకు పెట్టి బన్నీ మారుతి మూవీతో సేఫ్ గేమ్ ఆడతాడా అంటూ మరికొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇవన్నీ గాలివార్తలు మాత్రమే అనీ మారుతి యథాలాపంగా చెప్పిన కథను బన్నీ ఓకె చెప్పినంత మాత్రాన ‘పుష్ప’ సినిమా నుండి బన్నీ వెనక్కు వెళ్ళే ఆలోచన లేదు అంటూ బన్నీ సన్నిహితులు ఈవార్తలను ఖండిస్తున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: