తెలుగు సినిమాలో తక్కువ కాలంలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కోటా శ్రీనివాసరావు. ఆయన సినిమాలు ఆయన నటన అన్నీ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి అని ఆయనను బాగా అభిమానించే వారు చెప్తూ ఉంటారు. కోటా సినిమాలో ఉన్నారు అనగానే చాలా మందికి ఇప్పటికి కూడా ఒక జోష్ అనేది ఉంటుంది. ఆ విధంగా ఆయన తక్కువ కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనే చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలు చాలా వరకు మంచి విజయాలు సాధించాయి. ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే చాలా మందికి తెలియదు. 

 

ఆయన సొంత ఊరు కృష్ణా జిల్లా కంకిపాడు. విజయవాడ కు అతి దగ్గరగా ఉండేది ఆ ఊరు. ఆయన అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు. ఆ తర్వాత నాటకాల మీద ఉన్న ఆసక్తితో ఆయన విజయవాడ చెన్నై హైదరాబాద్ ఎక్కువగా తిరగడం సినిమాల్లో నటించే అవకాశాలు రావడం వంటివి జరిగాయి. ఆయన సినిమాలు అనగానే చాలా మందికి ఇప్పటికి కూడా ఒక క్రేజ్ అనేది ఉంది. ఎన్నో మంచి సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేసారు ఆయన. ఎన్నో సినిమాలు ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. విలన్ గా కమెడియన్ గా ఆయన పోషించిన పాత్రలు ఎవరూ కూడా పోషించలేదు అనేది వాస్తవం. 

 

ఆయన ఎందరో అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు కూడా. ఆయన సినిమాలు చాలా వరకు విజయం సాధించాయి. అయితే ఆయన వ్యక్తిగత జీవితం లో మాత్రం కొడుకు చనిపోయిన తర్వాత చాలా బాగా ఇబ్బంది పడ్డారు అని చెప్తూ ఉంటారు. కొడుకు బండి ప్రమాదంలో మరణించడం ఆయన భరించలేకపోయారు. అయితే ఆ తర్వాత ఆయన మనువడి కోసమే ఉన్నారని అంటారు. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఎక్కువగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: