ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు చిరంజీవి. ఆయన తన కెరీర్ లో చూడని సాధించని విజయం అనేది ఏదీ కూడా లేదు అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా సాధించలేని విజయాలను ఆయన సాధించారు అనేది వాస్తవం. అగ్ర నటుడిగా ఆయన చేసిన సినిమాల గురించి ఆయన పని చేసిన దర్శకుల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆయన సినిమా లు ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. ఆయనకు ఎక్కడ లేని పేరు రావడమే కాకుండా ఆయన నటనకు వచ్చిన అవార్డులు అన్నీ ఇన్ని కావు అనే చెప్పుకోవచ్చు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఆయన సొంత ఊరు విషయానికి వస్తే ఆయన సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. అక్కడ ఆయన పుట్టి పెరిగారు. అక్కడి నుంచి ఆయన సినిమాల్లోకి అడుగు పెట్టిన విధానం నుంచి ప్రతీ ఒక్కటి కూడా సంచలనం గానే చెప్పుకోవచ్చు. స్టార్ హీరో అయినా సరే ఆయన సొంత ఊరుని ఎప్పుడు కూడా మర్చిపోలేదు అనే చెప్పవచ్చు. ఆయన సినిమాలు చూసిన వారు అయితే ఆయనను ఒక దేవుడిగా కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సొంత ఊరికి ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటారు. సొంత జిల్లా అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం అని కూడా అంటూ ఉంటారు. 

 

అక్కడ సినిమాల షూటింగ్ కి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని టాలీవుడ్ జనాలు అంటూ ఉంటారు. ఇక ఆయన ప్రస్తుత సినిమా షూటింగ్ కూడా అక్కడే  జరుగుతుంది. ఆయన ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమా తర్వాత ఆయన ఒక రీమేక్ సినిమా లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: