రామ్ పోతినేని... రామ్... ఈ పేరు అమ్మాయిలకు ఒక క్రేజ్. తక్కువ కాలంలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా ఎక్కువ ఫ్లాప్ సినిమాలు చేసినా సరే అతనికి మాత్రం మంచి గుర్తింపు అనేది వచ్చింది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అతనికి ఫాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇక రామ్ సినిమాలు అనగానే ముందు నుంచి కొందరిలో ఒక క్రేజ్ అనేది ఉన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ సినిమాలు టీవీ లో వచ్చినా సరే చూసే ప్రేక్షకులు ఉన్నారు. కెరీర్ లో ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఎక్కడా కూడా భయపడకుండా రామ్ సినిమాలు చేయడం మనం చూసాం. 

 

చిన్న వయసు లోనే స్టార్ హీరోగా ఆయనకు గుర్తింపు వచ్చింది గాని మంచి సినిమాలను తర్వాతి కాలంలో అతను చేయలేదు. ఇక అతని చిన్న తనం విషయానికి వస్తే అతనిది ప్రకాశం జిల్లా కారంచేడు. తన తల్లి తండ్రులది అక్కడే. అయితే రామ్ మాత్రం పుట్టింది హైదరాబాద్ లో. అక్కడే అతను ఉన్నాడు చదువుకున్నాడు. ప్రకాశం జిల్లాతో అనుబంధం ఉన్నా సరే రామ్ ఎక్కువగా హైదరాబాద్ చెన్నై లోనే ఉండే వాడు. రామ్ సినిమాల కోసం ఎక్కువగా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తూ ఉండే వాడు. అతనికి చిన్న తనం నుంచి సినిమాలు అనగానే ఒక పిచ్చి అని... 

 

అందుకే సినిమాల్లోకి తల్లి తండ్రులు వద్దు అని చెప్పినా వచ్చాడు అని అంటారు. ఇక అతని వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రామ్ కి పెద్దగా ప్రేమ వ్యవహారాలూ అనేవి ఎక్కువగా లేవు అని అంటారు. అతని ప్రేమ గురించి ఎప్పుడు కూడా మీడియా లో వార్తలు కూడా వచ్చిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. రాం ఇప్పుడు ఒక సినిమాలో నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: