కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో థియేటర్ల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. రెండు నెలల నుండి సినిమాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్డౌన్ కారణంగా గుంపులుగా గుంపులుగా జనం గుమిగూడడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. అందువల్లే నాలుగవ విడత లాక్డౌన్ లో మినహాయింపులు ఇచ్చినప్పటికీ వాటిలో థియేటర్లు, ఫంక్షన్ హాల్స్ కి అనుమతి ఇవ్వలేదు.

 


అయితే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన చర్చల అనంతరం సినిమా వర్గాల్లో ఒక ఆశ మొదలైంది. సినీ పెద్దలంతా తెలంగాణ సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్ అనుమతి ఇవ్వమని కేసీఆర్ ని కోరారు. షూటింగ్స్ లో పాటించే ప్రమాణాలు వచ్చాక అనుమతులు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో సినీలోకం ఆనందంగా ఉంది.

 

ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో థియేటర్లు కూడా తెరుచుకుంటాయన్న వాదన వినిపిస్తోంది. అయితే ఒకవేళ థియేటర్లు తెర్చుకుంటే మొదటగా రిలీజ్ అయ్యే సినిమా ఏదై ఉంటుందనేది పెద్ద ప్రశ్నగా తయారైంది. కరోనా భయంతో బిక్కు బిక్కుమంటూ బ్రతుకున్న జనాలు థియేటర్లకి వస్తారా లేదా అన్నది సందేహమే. ఈ నేపథ్యంలో జనాల్ని సినిమాకి తీసుకువచ్చే సత్తా ఏ సినిమాకి ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది.

 

అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. మరో పదిరోజుల పాటు మాత్రమే షూటింగ్ ఉంది. చిత్రీకరణకి అనుమతులు రాగానే వకీల్ సాబ్ పనులు మొదలవుతాయి. త్వరగా అయిపోతాయి కూడా. అంటే థియేటర్లలో రిలీజ్ అయ్యే మొదటి సినిమా వకీల్ సాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఐతే క్యూలో నాని నటించిన వి, రానా దగ్గుబాటి అరణ్యతో పాటు అనుష్క నిశ్శబ్దం కూడా ఉన్నాయి. మరి వీటన్నింటిలో వకీల్ సాబ్ అయితేనే కరెక్టుగా ఉంటుందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: