టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరో జగపతి బాబు. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆయన. మహిళా అభిమానులను తక్కువ కాలంలో సంపాదించుకున్న హీరో. కెరీర్ మొదట్లో ఆయన సాధించిన విజయాలు ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక సంచలనమే. ఆయన సినిమాలు అన్నీ కూడా ఎన్నో రికార్డులను నమోదు చేసాయి. ఆయన కెరీర్ లో అగ్ర దర్శకులతో ఆయన పని చేసారు. ఇక ఆయన చేసిన సినిమాలు క్రమంగా ఫెయిల్ అవుతూ వచ్చాయి. చాలా సినిమాలు ఫ్లాప్ కావడం తో ఆయన సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉందని భావించారు. 

 

అయితే ఆయన కెరీర్ లో విలన్ గా మారిన తర్వాత ఎక్కువగా విజయాలు నమోదు చేయడమే కాకుండా అక్కడి నుంచి ఆయన కెరీర్ కి తిరుగు లేకుండా పోయింది అనే చెప్పవచ్చు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే తండ్రి అగ్ర నిర్మాత. ఇక ఆయన సినిమాల మీద తండ్రి ప్రభావం ఎక్కువగా ఉండేది కాదు. ఆయన సినిమాలు ఎన్ని చేసినా సరే తండ్రి సినిమాల మీద గాని తండ్రి పేరు మీద గాని ఎక్కువగా ఆధారపడిన సందర్భం అనేది ఎప్పుడు కూడా లేదు అనే చెప్పాలి. ఇప్పుడు కూడా ఆయన తన సొంత శక్తి తోనే పైకి వచ్చారు గాని తండ్రి పేరు ని ఏ విధంగా కూడా ఆయన వాడుకోలేదు. 

 

ఇక ఆయన సొంత ఊరు బందరు. అయితే తండ్రి అగ్ర నిర్మాత కావడం తో ఆయన చదువు అంతా కూడా హైదరాబాద్ లోనే సాగింది. ఆయన సినిమాలు చేసిన సమయంలో కూడా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన సొంత ఊరికి వెళ్ళడం దాదాపుగా తగ్గిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: