ఇటీవ‌ల మన టాలీవుడ్ హీరోలు కూడా బాగా మారిపోయారు. కేవ‌లం సినిమాల్లోనే కాకుండా బయట కూడా మంచి అలవాట్లు సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా సొంత ఊర్లను బాగుచేసే పనిలో పడ్డారు సెలబ్రిటీలు. గ్రామం బాగుపడితే దేశం బాగుపడుతుందనే కాన్సెప్ట్‌తో ముందడుగు వేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా మార్చడానికి రీల్ హీరోలు.. రియ‌ల్ హీరోలుగా మారి తమ శక్తులన్నీ దారపోస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎంద‌రో స్టార్లు సొంత గ్రామాల‌తో పాటు ఇత‌ర గ్రామాల‌ను కూడా ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి వారిలో మ‌న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక‌రు.

 

అల్లు అర్జున్ చెన్నైలో పుట్టాడు. పద్దెనిమిదేళ్ళ వరకు అక్కడే పెరిగాడు. అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లల్లో ఒకడు. పెద్దన్నయ్య వెంకటేష్ (బాబీ), తమ్ముడు అల్లు శిరీష్. ఇక చెన్నైలోనే పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. కష్టపడి చదవినా మార్కులు అంతగా వచ్చేవి కావు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో ఓ చిన్నపిల్లవాడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. అయితే వాస్త‌వానికి బ‌న్నీ స్వ‌గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. అల్లు అర్జున్ తాత‌గారు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య పాల‌కొల్లులోనే జ‌న్మించారు. 

 

మ‌రియు అల్లు అర్జున్ తండ్రి అల్లు అర‌వింద్ కూడా పాల‌కొల్లులోనే పుట్టారు. అందుకే అల్లు అర్జున్ సొంతూరును ఎప్పుడూ మ‌ర్చిపోలేదు. అయితే గ‌త ఏడాది సంక్రాంతి వేడుకలను తన సొంత ఊరు పాలకొల్లులో జ‌రుపుకున్న బ‌న్నీ.. ఈ ఊరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. బన్నీ తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడి ప్రజలు కూడా ఆనందంతో మునిగిపోయారు. ఇక సొంత ఊరును దత్తత తీసుకున్న అల్లు వారబ్బాయి.. ఎన్నో అభివృద్ధి ప‌నులు చేస్తాన‌ని మాట కూడా ఇచ్చాడు. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఊరు మనకు ఎంతో ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయ్యాలి అన్న లైన్‌ను మ‌న హీరోలు బాగానే ఫాలో అవుతున్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: